యాప్నగరం

కేటీఆర్‌కు ప్రధాని నుంచి అభినందన లేఖ

తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌కు ప్ర‌ధాని మోదీ ఓ ప్రత్యేక లేఖ రాశారు. మిష‌న్ భ‌గీర‌థ‌తో పాటు స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మాల‌ అమలు విషయంలో తెలంగాణ రాష్ట్ర చొరవను ఆ లేఖలో ఆయన ప్ర‌శంసించారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం పట్ల స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. అక్టోబరు 2న గాంధీ జయంతి..

TNN 7 Dec 2022, 2:48 am
తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌కు ప్ర‌ధాని మోదీ ఓ ప్రత్యేక లేఖ రాశారు. మిష‌న్ భ‌గీర‌థ‌తో పాటు స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మాల‌ అమలు విషయంలో తెలంగాణ రాష్ట్ర చొరవను ఆ లేఖలో ఆయన ప్ర‌శంసించారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం పట్ల స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. అక్టోబరు 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘స్వచ్ఛత హి సేవా’ ఉద్యమంలో పాల్గొనాలని కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అదేవిధంగా కేటీఆర్‌ తన అనుభవాలను నరేంద్ర మోదీ యాప్‌లో పంచుకోవాలని కోరారు. స్వ‌చ్ఛమైన దేశ నిర్మాణం కోసం మీరు కూడా చేయి క‌ల‌పాలంటూ మోదీ త‌న లేఖ‌లో కేటీఆర్‌ను కోరారు.
Samayam Telugu ktr modi


స్వ‌చ్ఛత విషయంలో మనం తీసుకునే చొరవే.. సమాజం పట్ల మన దృక్పథాన్ని అభివ్యక్తీకరిస్తుందని మ‌హాత్మా గాంధీ అన్నార‌ని, ఆ మంత్రాన్నే నిజం అయ్యేలా చూడాల‌ని మోదీ పేర్కొన్నారు. స్వ‌చ్ఛ‌మైన దేశాన్ని నిర్మిస్తేనే.. పేద‌, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు లాభం చేకూరుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా.. ప్ర‌తి ఇంటికి స్వ‌చ్ఛ‌మైన నీరును అందించే సంకల్పంతో తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన‌ ‘మిషన్ భగీరథ’ ప‌థ‌కాన్ని మెచ్చుకున్నారు.
Hon'ble PM @narendramodi Ji has written a letter acknowledging Telangana's efforts in Mission Bhagiratha & promoting 'Swachhata Hi Seva' pic.twitter.com/AxQ7DdsjaN— KTR (@KTRTRS) September 14, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.