యాప్నగరం

నంద్యాలలో కలకలం సృష్టించిన కంటైనర్

కర్నూలు జిల్లా నంద్యాలలో ఉప ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో అధికారంలో వున్న టీడీపీ ఓటర్లకి డబ్బులు....

TNN 18 Aug 2017, 10:31 pm
కర్నూలు జిల్లా నంద్యాలలో ఉప ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో అధికారంలో వున్న టీడీపీ ఓటర్లకి డబ్బులు పంచి పెట్టేందుకు ప్రయత్నిస్తోందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. విజయవాడ నుంచి నంద్యాలకి వెళ్తున్న ఓ కంటైనర్ వాహనాన్ని గాజులపల్లె మెట్ట శివార్లలో శుక్రవారం రాత్రి ఎన్నికల సంఘం అధికారులు అడ్డుకున్నారు. ఈ వ్యానులో ఏం వుందో చెక్ చేయాలని నిర్ణయించిన ఎన్నికల సంఘం సిబ్బంది కంటైనర్‌ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలించారు.
Samayam Telugu locked container creates scene in nandyal
నంద్యాలలో కలకలం సృష్టించిన కంటైనర్


అయితే, వ్యాను డోర్ తెరిచేందుకు వ్యాన్ డ్రైవర్ కుదరదు అని చెప్పడంతో అందులో ఓటర్లకి పంచిపెట్టేందుకు తరలిస్తున్న నగదు ఉందని భావించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇదే విషయాన్ని అక్కడున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. అనంతరం అనేక అనుమానాలు, హైడ్రామా మధ్య ఎలక్షన్ నోడల్‌ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో నంద్యాల ఆర్డీవో కార్యాలయంలో కంటైనర్‌ తాళం పగులగొట్టి తలుపులు తెరిచి చూశారు. కానీ ఆ వ్యానులో ఏమీ లేదని తేల్చడంతో అంతసేపూ అక్కడ జరిగిన హై డ్రామాకు ఫుల్ స్టాప్ పడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.