యాప్నగరం

హైదరాబాద్‌లో లాకప్ డెత్, హత్యేనంటున్న బంధువులు!

హైదరాబాద్ పాతబస్తీలోని మంగళ్‌హట్ పోలీస్ స్టేషన్‌లో భీంసింగ్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.

TNN 19 Mar 2017, 3:22 pm
హైదరాబాద్ పాతబస్తీలోని మంగళ్‌హట్ పోలీస్ స్టేషన్‌లో భీంసింగ్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఓ ఘర్షణకు సంబంధించిన కేసు విచారణ కోసం స్టేషన్‌కు తీసుకెళ్లి, పోలీసులే కొట్టి చంపారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం తెల్లవారుజామున మంగళ్‌హట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. భీంసింగ్‌ను కొట్టి చంపిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా పోలీస్ బెలాలియన్ బస్సు అద్దాలు పగలగొట్టారు. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జి చెదరగొట్టారు.
Samayam Telugu lockup death in hyderabad relatives stages protest at police station
హైదరాబాద్‌లో లాకప్ డెత్, హత్యేనంటున్న బంధువులు!


అయితే భీంసింగ్‌పై చేయిచేసుకోలేదని, కావాలంటే సీసీటీవీ ఫుటేజ్‌లు బయటపెడతామని పోలీసులు చెబుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున మూత్రశాలకు వెళ్లిన భీంసింగ్ బయటకి వచ్చాక కూలబడ్డాడని, ఆసుపత్రికి తీసుకెళితే అప్పటికే మరణించాడని డాక్టర్లు వెల్లడించినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. భీంసింగ్ మృతి డాక్టర్ల బృందం రిపోర్ట్ తయారుచేస్తుందని, ఆ వివరాలు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. భీంసింగ్‌కు ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం కూడా నిర్వహించినట్లు వెల్లడించారు.

కాగా, భీంసింగ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని, న్యాయ విచారణ జరిపించాలని స్థానిక బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఆ కుటుంబానికి రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. మరోవైపు భీంసింగ్ కుటుంబాన్ని కాంగ్రెస్‌ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్‌‌కుమార్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీంసింగ్‌ మృతిపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. భీంసింగ్‌ మృతికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, అతని కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.