యాప్నగరం

లోకేష్ కోసం చంద్రబాబు సీటు త్యాగం?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ బాబు

TNN 28 Sep 2017, 7:50 am
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ బాబు పోటీకి నియోజకవర్గం దొరికిందా? ప్రస్తుతం మంత్రిగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా, లోకేష్ ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొనలేదు. ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యి లోకేష్ మంత్రి అయ్యారు. పరోక్ష పద్ధతిలో ప్రజాప్రతినిధి అయ్యారు. ఈ విషయంలో ప్రతిపక్షం నుంచి విమర్శలు కూడా వచ్చాయి. చంద్రబాబు నాయుడు తనయుడు.. ప్రత్యక్ష పద్ధతిలో గాక పరోక్ష పద్ధతిలో గెలవడం ఏమిటని ప్రతిపక్షం ఎద్దేవా చేసింది.
Samayam Telugu lokesh to contest from kuppam
లోకేష్ కోసం చంద్రబాబు సీటు త్యాగం?


మరి ఇలాంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అయినా లోకేష్ ప్రత్యక్ష ఎన్నికను ఎదుర్కొనాలని భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు లోకేష్ బాబుకు అందుకు తగ్గ నియోజకవర్గం దొరికేసిందని సమాచారం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లోకేష్ పోటీ చేయబోయేది మరెక్కడ నుంచినో కాదు.. తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచి! రాజకీయ వర్గాల్లో ఈ మేరకు ప్రచారం జరుగుతోంది. లోకేష్ కుప్పం నుంచి పోటీ చేయనున్నారని అంటున్నారు.

ప్రస్తుతం చంద్రబాబు ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. లోకేష్ అక్కడ నుంచి పోటీ చేస్తే.. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? అనే సందేహం సహజంగానే వస్తుంది. ఈ నేపథ్యంలో అందుకు తగ్గ నియోజకవర్గాన్ని పరిశీలిస్తున్నారట. కొడుకు కోసం కుప్పం వదిలి.. బాబు మరో చోట పోటీ చేస్తారని, అది ఎక్కడ నుంచి అనేది.. ఇంకా డిసైడ్ కాలేదని సమాచారం.

చాలా నియోజకవర్గాలు పరిశీలనలో ఉన్నాయని.. రాయలసీమలోని మరో నియోజకవర్గం నుంచి లేదా, రాజధాని ప్రాంతానికి దగ్గర్లోని ఏదైనా నియోజకవర్గం నుంచి చంద్రబాబు పోటీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.