యాప్నగరం

నా భార్యకు పెళ్లి చేసేస్తున్నారు

కులాల్ని పట్టించుకోకుండా ప్రేమ పెళ్లి చేసుకున్న జంటని పెద్దలు విడదీశారు.

TNN 21 May 2017, 8:05 am
కులాల్ని పట్టించుకోకుండా ప్రేమ పెళ్లి చేసుకున్న జంటని పెద్దలు విడదీశారు. భార్యను తీసుకెళ్లి ఎక్కడో దాచారు. తమ ఇద్దరిని కలపాలంటూ భర్త పోలీసుల చుట్టూ, మీడియా చుట్టూ తిరుగుతున్నాడు. చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళెం మండలం ఎరుకలపల్లెకు చెందిన ఇసుకపల్లి బాలరాజు, రూపారణి చాలా ఏళ్లుగా ఒకరికొకరు తెలుసు. ఇద్దరి ఇళ్లు కూడా పక్కపక్కనే ఉంటాయి. ఆ క్రమంలో ప్రేమలో పడ్డారు. ఇద్దరి కులాలు వేరుకావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. ముఖ్యం అమ్మాయి తల్లిదండ్రులు, అన్న తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రేమికులిద్దరూ ఇంట్లోంచి బయటికివెళ్లిపోయారు. ఈ నెల 12న మదనపల్లెలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం రక్షణ కావాలంటూ జిల్లా ఎస్పీని కలిశారు. ఎస్పీ వారికి రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించారు.
Samayam Telugu love marriage in chittoor couple seeks police protection
నా భార్యకు పెళ్లి చేసేస్తున్నారు


స్థానిక ఎస్ ఐను కలిసేందుకు ప్రేమజంట వెళుతుండగా దారి మధ్యలోనే అమ్మాయి అన్న, మామయ్యలు వచ్చి బాలరాజును తీవ్రంగా కొట్టి, రూపారాణిని తీసుకెళ్లిపోయారు. ఊరిలో అడుగుపెట్టినా, మళ్లీ అమ్మాయి జోలికి వచ్చినా చంపేస్తామని హెచ్చరించారు. బాలరాజు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాళ్లు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కాగా రూపారాణికి వేరే వివాహం చేసేందుకు పెద్దలు ప్రయత్నిస్తున్నారని బాలరాజుకు తెలిసింది. వెంటనే విలేకరులకు ఫోన్ చేసి తన గోడును వెళ్లబోసుకున్నాడు. తన భార్యకు వేరే పెళ్లి చేయడానికి చూస్తున్నారని, ఆమెను తనతో కలపాలని కోరుకుంటున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.