యాప్నగరం

పవన్ సందేశంపై స్పందించిన కత్తి

తనపై దాడి జరిగిన తర్వాతే ఈ లేఖ వచ్చిందంటే... ఇప్పుడు వరకు దాడి కోసం వేచి చూశారా అని ప్రశ్నించాడు

TNN 19 Jan 2018, 9:51 pm
గుర్తుతెలియని వ్యక్తులు సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై కోడి గుడ్లతో దాడి చేసిన నేపథ్యంలో నటుడు పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ ద్వారా శుక్రవారం తన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు సందేశం పంపిన సంగతి తెలిసిందే. ఈ లేఖ విడుదలయ్యే సమయానికి కత్తి మహేష్ ఓ ప్రముఖ టీవీ చానెల్‌ డిబేట్‌లో ఉన్నాడు. ఈ సందర్భంగా పవన్ సందేశం చర్చకు వచ్చింది.
Samayam Telugu mahesh kathi responce about pawan kalyans letter
పవన్ సందేశంపై స్పందించిన కత్తి

Read Also: ​ ‘కత్తి’ గోల: ఎట్టకేలకు పవన్ సందేశం!
దీనిపై కత్తి స్పందిస్తూ.. ఇలాంటి లేఖలతో తన పోరాటం ఆగదని స్పష్టం చేశాడు. పవన్ కళ్యాణ్ తనకు క్షమాపణలు చెప్పే వరకు తాను విశ్రమించనని తెలిపాడు. తనపై దాడి జరిగిన తర్వాతే ఈ లేఖ వచ్చిందంటే... ఇప్పుడు వరకు దాడి కోసం వేచి చూశారా అని ప్రశ్నించాడు. ఇదే లేఖ ఇంతకు ముందు వచ్చి ఉంటే సరేనని, దాడి జరిగిన తర్వాత వచ్చింది కాబట్టి తాను పోరాటం కొనసాగిస్తానని కత్తి తెలిపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.