యాప్నగరం

అమ్మాయిలకు వేధింపులు.. కార్పోరేటర్ కొడుకు అరెస్ట్

ఫేస్‌బుక్‌లో ఫేక్ ఐడీలు క్రియేట్‌చేసి అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తున్న ఓ కార్పోరేటర్ కుమారుడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.

TNN 20 Sep 2017, 9:41 am
ఫేస్‌బుక్‌లో ఫేక్ ఐడీలు క్రియేట్‌చేసి అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తున్న ఓ కార్పోరేటర్ కుమారుడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మల్కాజ్‌గిరి కార్పోరేటర్ జగదీష్ గౌడ్ కుమారుడు అభిషేక్ గౌడ్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది. వీరు ఫేక్ ఐడీలతో ఫ్రెండ్ రిక్వస్ట్‌లు పెట్టడంతో పాటు అసభ్య సందేశాలతో వేధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అభిషేక్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
Samayam Telugu malkajgiri trs corporator son arrested for harassing women
అమ్మాయిలకు వేధింపులు.. కార్పోరేటర్ కొడుకు అరెస్ట్


తను చదువుకున్న స్కూళ్లో జూనియర్లుగా ఉన్న అమ్మాయిలను అభిషేక్ టార్గెట్ చేశాడు. ఫేక్ ఫేస్‌బుక్ ఐడీలతో వారికి ఫ్రెండ్ రిక్వెస్టులు పెట్టాడు. రిక్వెస్టులను యాక్సెప్ట్ చేయని అమ్మాయిలకు ఇంటర్నెట్ వాయిస్ కాల్ ద్వారా అసభ్య సందేశాలు పంపాడు. తనకు సహకరించకపోతే వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి పోర్న్ సైట్లలో పెడతానని అమ్మాయిలను బెదిరించాడు. ఇలా చాలా మందినే వేధించినప్పటికీ భయంతో వారు ఈ విషయాన్ని బయటపెట్టలేదు. అయితే ఈ టార్చర్‌ను భరించలేని 12 మంది అమ్మాయిలు షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు పక్కా ఆధారాలతో అభిషేక్ గౌడ్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.