యాప్నగరం

బస్సులో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించి దొరికేశాడు

బస్సులో తోటి ప్రయాణికురాలిపై అసభ్యకరంగా ప్రవర్తించి, అడ్డంగా దొరికిపోయాడు ఓ ప్రబుద్ధుడు. పక్కనే భార్య ఉన్నా యువతి నిద్రిస్తోన్న బెర్త్ దగ్గరకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు.

Samayam Telugu 25 Mar 2018, 10:01 am
బస్సులో తోటి ప్రయాణికురాలిపై అసభ్యకరంగా ప్రవర్తించి, అడ్డంగా దొరికిపోయాడు ఓ ప్రబుద్ధుడు. పక్కనే భార్య ఉన్నా యువతి నిద్రిస్తోన్న బెర్త్ దగ్గరకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ యువతికి మెలకువ వచ్చి అరవడంతో నిందితుడి భాగోతం వెలుగుచూసింది. దీంతో అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తోన్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి విజయవాద నుంచి హైదరాబాద్ వస్తోన్న మార్నింగ్ స్టార్ ప్రయివేట్ ట్రావెల్స్ బస్సులో నిందితుడు రవిచంద్ర (32) తన భార్యతో సహా ఎక్కాడు. గచ్చిబౌలిలో హాస్టళ్లు నడుపుతోన్న నిందితుడు మన్నె రవిచంద్రది గుంటూరు జిల్లా తాడికొండ.
Samayam Telugu Ravi


అదే బస్సులో విజయవాడకు చెందిన ఓ యువతి (25) సైతం ఎక్కింది. ఇటీవలె ఆమెకు వివాహం నిశ్చయం కాగా, కాబోయే భర్త సైతం అదే బస్సులో ప్రయాణిస్తున్నాడు. ఆ యువతి అప్పర్ బెర్తులో నిద్రిస్తుండగా తెల్లవారుజాము 4గంటల సమయంలో ఆమె బెర్తు పక్కన నిలబడి నిందితుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెకు మెలకువ రావడంతో ఒక్కసారిగా అరించింది. దీంతో రవిచంద్ర పరిగెత్తుకెళ్లి బస్‌డ్రైవర్‌ వెనుకున్న సీటులో కూర్చుండిపోయాడు. దీనిపై ఆ యువతి తన కాబోయే భర్తకు తెలపడంతో అతడు రవిచంద్రను నిలదీశాడు. డ్రైవర్‌కు జరిగింది చెప్పడంతో హయత్‌నగర్ సమీపానికి వచ్చిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షీటీమ్స్‌ అతడిని అదుపులోకి తీసుకున్నాయి. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు శనివారం రిమాండుకు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.