యాప్నగరం

చంద్రబాబుపై అనుచిత పోస్టులు.. వ్యక్తి అరెస్టు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తనయుడు, మంత్రి లోకేష్‌పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

TNN 22 Aug 2017, 11:27 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తనయుడు, మంత్రి లోకేష్‌పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా చంద్రబాబు‌కు అపఖ్యాతి కలిగించేలా ఫొటోలు, కంటెంట్‌ను షేర్ చేస్తున్న బసవరాజు అనే 30 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని కలిగనూరు గ్రామానికి చెందిన బసవరాజు ‘వైఎస్ఆర్‌సీపీ అన్అఫీసియల్’ పేరిట ఫేస్‌బుక్ పేజ్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ పేజ్ ద్వారా సీఎంతో పాటు ఆయన తనయుడు లోకేష్ ఫొటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తున్నాడు. వాటిని వాట్సాప్ ద్వారా షేర్ చేస్తున్నాడు.
Samayam Telugu man arrested for trolling cm chandrababu naidu on social media
చంద్రబాబుపై అనుచిత పోస్టులు.. వ్యక్తి అరెస్టు


చంద్రబాబుని, లోకేష్‌ను మహిళలు కొడుతున్నట్లు, అలాగే నంద్యాల ప్రచారానికి సబంధించి కొన్ని అసభ్యకర ఫొటోలు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అలాగే నందమూరి బాలకృష్ణపై అనుచిత పోస్టులు పెట్టాడు. దీన్ని గమనించిన సుబ్బు అనే టీడీపీ నాయకుడు బసవరాజుపై గుడుపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 341, సెక్షన్ 355, సెక్షన్ 469 కింద బసవరాజుపై కేసులు పెట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.