యాప్నగరం

​భార్య కువైట్లో.. కూతురిపై కన్నతండ్రి అఘాయిత్యం

ఇలాంటి వాళ్లను కీచకుడితో పోల్చడం.. ఆ రాక్షసుడికి కూడా అవమానమేనేమో.

TNN 3 Jun 2017, 2:38 pm
ఇలాంటి వాళ్లను కీచకుడితో పోల్చడం.. ఆ రాక్షసుడికి కూడా అవమానమేనేమో. కీచకుడు పరాయి వనితను ఆశించాడు. కలియుగ కీచకులు మాత్రం కన్నబిడ్డనూ వదలడం లేదు. సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఇది. రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని ఒక గ్రామంలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. తనను చూడటానికి వచ్చిన పదకొండేళ్ల కూతురిపై అఘాత్యానికి పాల్పడ్డాడు ఆ దుర్మార్గపు తండ్రి. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న బాలిక నోటిని అదిమి పట్టి అతడు ఈ దారుణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది.
Samayam Telugu man raped his own daughter
​భార్య కువైట్లో.. కూతురిపై కన్నతండ్రి అఘాయిత్యం


పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. నిందితుడు ఒక ఎలక్ట్రిషియన్. చెడు అలవాట్లు అధికం కావడంతో ఇతడిని కొన్నేళ్ల కిందట భార్య వదిలిపెట్టింది. ఇద్దరు పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమెకు కువైట్లో ఉపాధి అవకాశం లభించడంతో పిల్లలను తన తల్లిదండ్రుల వద్ద విడిచి వెళ్లింది. అప్పటి నుంచి పిల్లలిద్దరూ అమ్మమ్మ వాళ్లింట్లోనూ ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అమ్మమ్మ సూచన మేరకు వారు చుట్టపుచూపుగా తండ్రిని చూడటానికి వచ్చారు.

గురువారం రాత్రి కరెంట్ పోవడంతో బాలిక నాయనమ్మ, తాతయ్య, అన్న ఆరుబయట పడుకున్నారు. బాలిక మాత్రం ఇంట్లో పడుకుంది. అర్ధరాత్రి వేళ ఇంట్లోకి ప్రవేశించిన తండ్రి కళ్లుమూసుకుపోయి కూతురిపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఈ అకృత్యం గురించి వెలుగులోకి రావడంతో అందరూ విస్మయానికి గురిఅయ్యారు. వైద్యం కోసం బాలికను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. తనపై కేసు నమోదు కావడంతో ఆ కీచకతండ్రి కిరోసిన్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడికీ ప్రభుత్వాసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నట్టుగా పోలీసులు పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.