యాప్నగరం

Mangalagiri: రూ.10 లకే సంచి నిండుగా కూరగాయలు!

ఓ వైపు కార్తీక మాసం, అంతంత మాత్రంగా ఉన్న దిగుబడులతో కూరగాయలు ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కిలో వంకాయలు కనీసం రూ.40 పలుకుతున్నాయి.

Samayam Telugu 18 Nov 2018, 12:08 pm
రాజన్న రైతు బజారు పేరుతో రూ.10లకే సంచి నిండా ప్రజలకు కూరగాయలు అందజేసే కార్యక్రమాన్ని వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శనివారం ప్రారంభించారు. నామమాత్రపు ధరకే కూరగాయలు లభించడంతో జనం ఎగబడుతున్నారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజన్న రైతు బజారు ప్రారంభించడం వెనుక రెండు ఉద్దేశాలు ఉన్నాయని అన్నారు. పెరిగిపోతున్న కూరగాయల ధరల నుంచి వినియోగదారులకు ఊరట కలిగించడం మొదటి ఉద్దేశం కాగా, రెండోది నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తుచేయడానికి వ్యాఖ్యానించారు. అలాగే, సీఎం ముందు రాష్ట్రంలో పాలనపై దృష్టిసారించాలని, తర్వాతే జాతీయస్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కూటమి ఏర్పాటు చేయాలని ఎద్దేవా చేశారు. తన పాలన లోపాలను కప్పిపుచ్చుకోడానికి కేంద్రంపై నిందలు మోపుతూ చంద్రబాబు మరో నీరో చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
Samayam Telugu market


ఎమ్మెల్యే ప్రారంభించిన రాజన్న రైతు బజార్‌కు అనూహ్య స్పందన రావడంతో కూరగాయలు పండించే స్థానిక రైతులు పేదలకు సాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. పేదలకు మద్దతుగా ఉండాలనే సంకల్పంతో రాజన్న మార్కెట్ ప్రారంభించడం సంతోషకరమని స్థానిక న్యాయవాది సీతారామి రెడ్డి తెలిపారు. అనేక మంది రైతులు, భూస్వాములు ఉచితంగా కూరగాయలు సరఫరా చేయడంతోపాటు తక్కువ ధరకే వాటిని అందజేస్తున్నారు. స్థానిక మార్కెట్‌లో ధరలు మండిపోతున్నాయని, ఇక్కడ మాత్రం ఏడు రకాల కూరగాయలు కేవలం రూ.10 లకే వస్తున్నాయని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.