యాప్నగరం

Araku MLA: మావోయిస్టుల మెరుపుదాడి.. అరకు ఎమ్మెల్యే మృతి

గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు అదునుచూసి దెబ్బకొట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలపై దాడిచేసి హతమార్చారు.

Samayam Telugu 23 Sep 2018, 3:44 pm
గత కొద్దికాలంగా ఏజెన్సీలో స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా పంజా విసిరారు. విశాఖ జిల్లాలోని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, ఆయన ప్రధాన అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమపై ఆదివారం మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వీరి ఇద్దరూ మృతి చెందారు. డుంబ్రిగూడ మండలంలోని లిప్పిట్టిపుట్టు వద్ద నక్సల్స్ ఈ దాడికి పాల్పడ్డారు. గ్రామదర్శిని పర్యటనలో ఉండగా మావోయిస్టులు అదునుచూసి దెబ్బకొట్టారు. ఊహించని విధంగా దాడిచేసిన మావోలు, విచక్షణారహితంగా మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఏవోబీ కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది.
Samayam Telugu ఎమ్మెల్యే కిడారి


ఈ దాడిలో యాభై మందికి పైగా మావోయిస్టులు పాల్గొన్నట్టు సమాచారం. ఈ దాడిని ఎస్పీ రాహుల్ దేవ్ నిర్ధారించారు. కిడారి, సోమపై దాడి జరిగినట్లు మాకు సమాచారం అందిందని, సిబ్బంది సంఘటనా స్థలానికి పంపామని తెలిపారు. కాగా, గత ఎన్నికల్లో అరకు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీచేసి విజయం సాధించిన కిడారి సర్వేశ్వరరావు ఇటీవలే టీడీపీలో చేరారు. 2014లో తొలిసారి ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. గతంలో పలుసార్లు కిడారిని మావోయిస్టులు హెచ్చరించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.