యాప్నగరం

పోలీసులు అదుపులోనే ఆర్కే: వరవరరావు

ఏవోబీలో మల్కన్‌గిరి జిల్లాలో 28 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే.

TNN 27 Oct 2016, 4:19 pm
ఏవోబీలో మల్కన్‌గిరి జిల్లాలో 28 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. కాగా ఆ ఘటనలో మావోయిస్టు అగ్రనేత ఆర్.రామకృష్ణ (ఆర్కే)తో పాటూ, కొంతమంది నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు విరసం నేత వరవరరావు ఆరోపిస్తున్నారు. వారిని వెంటనే కోర్టు ముందు హాజరుపరచాలని డిమాండ్ చేశారు. ఆర్కేకు ఏం జరిగినా ఆ బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. అయితే ఏపీ డీజీపీ సాంబశివరావు గతంలోనే తమ అదుపులో ఆర్కే లేరని ప్రకటించారు.
Samayam Telugu maoist leader rk is in police custody says varavara rao
పోలీసులు అదుపులోనే ఆర్కే: వరవరరావు


నిజానికి ఆర్కే ఏవోబీ ప్రాంతంలోనే ఉంటున్నారన్న పక్కా సమాచారంతోనే గ్రే హౌండ్స్ దళాలు కూంబింగ్ చేపట్టాయి. అయితే ఎన్ కౌంటర్ అనంతరం చనిపోయిన వారిలో ఆర్కే తదితర అగ్రనేతలెవరూ లేరు. విప్లవ సంఘాల నాయకులకూ వారెక్కడున్నారన్న సమాచారం లేదు. దీంతో ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నట్టు పలువురు అనుమానిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.