యాప్నగరం

ప్రియుడి ఇంటి ఎదుట వివాహిత ఆందోళన

మోత్కూరు మండలం జామచెట్లబావికి బి. రేఖ, ఆత్మకూరు మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన శివరాం అయిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన రేఖ తల్లిదండ్రులు ఆమెకు జనగాం మండలం సిరిపురం గ్రామానికి చెందిన వ్యక్తితో బలవంతంగా పెళ్లి జరిపించారు.

TNN 12 Dec 2017, 3:52 pm
ప్రేమ విషయం తెలిసినా.. ఆ యువతి తల్లిదండ్రులు మరో యువకుడితో పెళ్లి జరిపించారు. వివాహానంతరం ఆమె తన ప్రేమ గాథను భర్తకు చెప్పి, ప్రియుడితోనే బతుకుతానని అడిగింది. ఈ విషయం తెలిసిన మరుక్షణమే ఇంట్లోంచి వెళ్లిపొమ్మంటూ భర్త తేల్చి చెప్పాడు. దీంతో పుట్టింటికి వెళ్లిపోయిన సదరు యువతి.. తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుణ్ని అడుగుతోంది. కానీ, తనను ప్రేమించి మరో వ్యక్తిని పెళ్లాడిందని ప్రియుడు మొహం చాటేశాడు. దీంతో తనను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్యే శరణ్యమంటూ ఆమె ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం రాఘవాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Samayam Telugu married woman protests infront of boyfriends house in yadadri bhongir
ప్రియుడి ఇంటి ఎదుట వివాహిత ఆందోళన


మోత్కూరు మండలం జామచెట్లబావికి బి. రేఖ, ఆత్మకూరు మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన శివరాం అయిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన రేఖ తల్లిదండ్రులు ఆమెకు జనగాం మండలం సిరిపురం గ్రామానికి చెందిన వ్యక్తితో బలవంతంగా పెళ్లి జరిపించారు. వివాహానంతరం రేఖ తాను శివరాంను ప్రేమించానని.. అతడితోనే ఉంటానని చెప్పడంతో భర్త ఇంటి నుంచి వెళ్లగొట్టాడు.

అప్పటి నుంచి పుట్టింట్లోనే ఉంటున్న రేఖ తనను పెళ్లి చేసుకోవాలని శివరామ్‌ను అడుగుతోంది. తనను ప్రేమించి మరో వివాహం చేసుకున్న ఆమెను పెళ్లి చేసుకోనని, అసలు ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని శివరాం అన్నాడు. దీంతో రేఖ సోమవారం (డిసెంబర్ 11) రాఘవాపురంలో శివరామ్‌ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది.

పెళ్లంటూ చేసుకుంటే శివరామ్‌నే చేసుకుంటానని.. లేకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యం అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఆ సమయంలో శివరామ్‌ ఇంట్లో లేడు. అతడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. కౌన్సిలింగ్‌ నిమిత్తం రేఖను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.