యాప్నగరం

అమరావతిపై ఐవైఆర్ పుస్తకం, పవన్ చేతుల మీదుగా...!

ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును తప్పుపడుతున్న మాజీ సీఎస్

Samayam Telugu 2 Apr 2018, 11:50 am
ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును తప్పుపడుతున్న మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఇప్పుడు తన పుస్తకంతో సిద్ధం అయ్యారు. అమరావతి నిర్మాణం పై విమర్శనాత్మక దోరణితో వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న ఐవైఆర్, రాజధాని అంశంపై తను పుస్తకాన్ని రాస్తున్నట్టుగా కొన్ని నెలల కిందట ప్రకటించారు. ఇప్పుడు ఆయన దాని టైటిల్ ను కూడా ప్రకటించి, ఏప్రిల్ ఐదో తేదీన దాన్ని ఆవిష్కరించనున్నట్టుగా ప్రకటించారు.
Samayam Telugu iyr4


‘ఎవరి రాజధాని అమరావతి’ పేరుతో తను పుస్తకం రాసినట్టుగా ఐవైఆర్ ప్రకటించారు. జనసేన అధిపతి పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ఆ పుస్తకాన్ని విడుదల చేయనున్నట్టుగా ఆయన తెలిపారు. ఇదే పుస్తకమే ‘హూజ్ క్యాపిటల్ అమరావతి’ పేరుతో ఇంగ్లిష్ లో అందుబాటులో ఉంటుందన్నారు. పుస్తకాన్ని వడ్డే శోభనాద్రీశ్వరరావుకు అంకితం ఇచ్చినట్టుగా ఐవైఆర్ ప్రకటించారు.

మిరుమిట్లు గొలిపేలా రాజధాని ఉండాలన్న చంద్రబాబు ఆలోచనలు సరికాదని ఐవైఆర్ పేర్కొన్నారు. ఇప్పటికీ మించి పోయింది లేదు.. రాజధాని పరిపాలన నగరంగా ఉంటే చాలని, ఆ విధంగా అమరావతిని నిర్మించాలని అభిప్రాయపడ్డారు. అలాగే ప్రజల నుంచి అప్పులు తీసుకుని రాజధానిని నిర్మించడం కూడా సాధ్యం కాదని ఐవైఆర్ పేర్కొన్నారు. ప్రజల నుంచి అప్పులు తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అనుమతిని తీసుకోవాలని.. ఎటువంటి పరిస్థితుల్లో అప్పులు తీసుకుంటున్నామో కూడా కేంద్రానికి వివరించాల్సి ఉంటుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.