యాప్నగరం

ఈ యేడాది చివరి కల్లా మిడ్ మానేరు నీళ్లు

ఈ యేడాది చివరికల్లా మిడ్‌మానేరులోకి నీళ్లు వస్తాయని భారీనీటి పారుదలశాఖమంత్రి

Samayam Telugu 8 May 2017, 8:29 pm
ఈ యేడాది చివరికల్లా మిడ్‌మానేరులోకి నీళ్లు వస్తాయని భారీనీటి పారుదలశాఖమంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రాజెక్టు కట్టగానే మొదటి ఏడాదే పూర్తిగా నీళ్లు వచ్చేలా చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. మిడ్‌మానేరులో ఈ సంవత్సరంలో 10 టీఎంసీల నీళ్లు నింపుతామని తెలిపిన హరీశ్‌రావు.. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు వివరాలను రైతులకు వివరించారు. హరీష్ రావు వెంట మంత్రి పోచారం శ్రీనివార్ రెడ్డి ఉన్నారు.
Samayam Telugu mid maneru water by december 2017 says harish rao
ఈ యేడాది చివరి కల్లా మిడ్ మానేరు నీళ్లు


శ్రీరాం సాగర్ నుంచి వరద కాలువ ద్వారా మధ్య మానేరుకు నీళ్లు వస్తాయని..ఆ నీటితో కోటి ఎకరాల సాగు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే కరువు ఉండబోదని చెప్పారు. తెలంగాణను సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని హరీష్ పునరుద్ఘాటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.