యాప్నగరం

పక్కనే శవమై పడి ఉన్నా, పట్టించుకోని మంత్రి

, ములుగు నియోజకవర్గంలో ఆదివారం మధ్యాహ్నం ఓ రోడ్డు ప్రమాదం జరిగింది.రోడ్డుపై శవం అలాగే పడి ఉంది. కొద్ది సేపటికి అదే దారిలో ఏ మాత్రం పట్టింపులేకుండా మంత్రి కాన్వాయ్ శవం పక్కనుంచే దూసుకెళ్లింది...

TNN 19 Dec 2016, 1:20 pm
జయశంకర్ భూపాలపల్లి (వరంగల్) జిల్లా, ములుగు నియోజకవర్గంలో ఆదివారం మధ్యాహ్నం ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చింతల్ ప్రాంతానికి చెందిన తాడూరి మధుసూదనాచారి (30) అనే యువకుడు మృతి చెందాడు. మధుసూదనాచారి తన ఇద్దరు స్నేహితులు సతీష్, గోపిలతో కలిసి బైక్ పై రామప్ప దేవాలయం వెళ్తుండగా నల్లకాలువ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొట్టడంతో బైక్ నడుపుతున్న మధుసూదనాచారి అక్కడికక్కడే మృతిచెందగా, మిగతా ఇద్దరు ప్రాణాలతో బయటపడిగలిగారు.
Samayam Telugu minister careless act though a dead body fell on the road on his way
పక్కనే శవమై పడి ఉన్నా, పట్టించుకోని మంత్రి


రోడ్డుపై శవం అలాగే పడి ఉంది. అక్కడ కొంతమంది జనం గుమిగూడారు. ఈ ప్రమాదం జరిగిన కొద్ది సేపటికి అదే దారిలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ కాన్వాయ్ వెళ్లింది. మంత్రికి ఎస్కార్ట్స్‌గా వచ్చిన పోలీస్ వాహనాలు రోడ్డును క్లియర్ చేస్తూ వెళ్లాయి. ఏ మాత్రం పట్టింపులేకుండా మంత్రి కాన్వాయ్ శవం పక్కనుంచే దూసుకెళ్లింది. తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి చందూలాల్, రోడ్డుపై ఓ వ్యక్తి అనాధలా పడి ఉన్న సమయంలో పక్కనుంచే వెళ్తూ కనీస బాధ్యతగా కూడా ఎవరిని పలకరించకుండా వెళ్లడం అక్కడ ఉన్న ప్రజలను కలవరపడేలా చేసింది.

ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్ నాయకులను ప్రజలు తమ ఆత్మీయులుగా భావిస్తూ వస్తున్నారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా తమకు తమ సొంత నాయకులు ఉన్నారని భరోసాతో ఉంటున్నారు. ఓ వైపు సీఎం కేసీఆర్ కూడా ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన దగర్నించీ అధికారాన్ని తలకెక్కించుకోవద్దు, పదవులు శాశ్వతం కాదు అంటూ తమ నేతలకు పలుమార్లు చెప్తూ వస్తున్నారు. కేసీఆర్ లాంటి వాడే రోడ్డుపై తెలిసిన వారు ఎదురైతే కాన్వాయ్ ఆపి మరి వారిని పలకరిస్తారు. అలాంటిది కొంత మంది నేతలు తామేదో తమ తమ రాజ్యాలకు చక్రవర్తులం అనేలా వ్యవహరించటం ద్వారా మొత్తం ప్రభుత్వంపైనే చెడ్డపేరు వస్తుంది. ఈ ఘటనలు చిన్నవే అయినప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో సదరు నాయకులపై వ్యతిరేక భావం పెరిగేలా చేస్తాయని గుర్తించాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.