యాప్నగరం

కూతురి ప్రోగ్రస్‌ను స్కూలుకెళ్లి తెలుసుకున్న కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగోగులను చూసుకుంటున్న మంత్రి కె. తారకరామారావు తన పిల్లల విషయంలోనూ అంతే జాగ్రత్త తీసుకుంటున్నారు.

TNN 7 Jan 2017, 7:09 pm
తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగోగులను చూసుకుంటున్న మంత్రి కె. తారకరామారావు తన పిల్లల విషయంలోనూ అంతే జాగ్రత్త తీసుకుంటున్నారు. ఎప్పుడూ బిజీ షెడ్యూల్‌తో ఉండే ఆయన శనివారం కూతురు అలేఖ్య చదువుతున్న స్కూలికి వెళ్లి పేరెంట్ టీచర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. పాప ఎలా చదువుతుందని ఆరా తీసారు. ఆయన ఊహించినదానికన్నా కూతురు బాగా చదువుతుండటంతో మురిసిపోయారు.
Samayam Telugu minister ktr attend parent teacher meeting for know his daughter progress
కూతురి ప్రోగ్రస్‌ను స్కూలుకెళ్లి తెలుసుకున్న కేటీఆర్


ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేసారు. కూతురి ప్రోగ్రెస్ రిపోర్టు తాను అనుకున్న దానికంటే బాగా ఉందని, ఇంకా బాగా చదవాలని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఉపాధ్యాయులతో మాట్లాడిన ఫోటోలను కూడా షేర్ చేసారు. ఈ సందర్భంగా పాఠశాలలోని టీచర్లతో కేటీఆర్ ముచ్చటించారట. తన శాఖల్లోని పనులు చూసుకుంటూనే పిల్లల బాగోగులను పట్టించుకుంటున్న కేటీఆర్‌లో మంచి నాయకుడే కాదు, బాధ్యత కలిగిన తండ్రి కూడా ఉన్నాడు.
Daughter's PTM; done with it. Was much better than expected. Should do it more often 😇 pic.twitter.com/BEbu8pk3ck — KTR (@KTRTRS) January 7, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.