యాప్నగరం

డిగ్గీ రాజాకు కేటీఆర్ ట్విట్టర్ కౌంటర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు కోపమొచ్చింది.

TNN 1 May 2017, 12:01 pm
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు కోపమొచ్చింది. కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన ట్వీటే ఆయన కోపానికి కారణం. డిగ్గారాజాకు స్ట్రాంగ్ గా రీట్వీట్ చేశారు కేటీఆర్. దీంతో రాజకీయ వేడి రాజుకుంది. దిగ్విజయ్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో తెలంగాణ పోలీసులు నకిలీ ఐసిస్ వెబ్ సైట్ ను సృష్టించారని అన్నారు. యువతను రెచ్చగొట్టేందుకు వారలా చేస్తున్నారని, సీఎం కేసీఆర్ వారికి ఆ అధికారం ఇచ్చారా అని ప్రశ్నించారు. ఆయన అధికారం ఇచ్చి ఉంటే బాధ్యత వహించి రాజీనామా చేయాలని , లేకుంటే విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్వీటులో పేర్కొన్నారు.
Samayam Telugu minister ktr strong counter to digvijay singh in twitter
డిగ్గీ రాజాకు కేటీఆర్ ట్విట్టర్ కౌంటర్


ఆ ట్వీటుకు కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. తన ట్వీటులో ముఖ్యమంత్రి పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం సరికాదన్నారు. దిగ్విజయ్ సింగ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని లేకుంటే ఆ వ్యాఖ్యలను సమర్థించేలా ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.
Telangana Police has set up a bogus ISIS site which is radicalising Muslim Youths and encouraging them to become ISIS Modules. — digvijaya singh (@digvijaya_28) May 1, 2017 Most irresponsible & reprehensible thing coming from a former CM. Request you to withdraw these comments unconditionally or provide evidence https://t.co/cg7p7Ym48X — KTR (@KTRTRS) May 1, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.