యాప్నగరం

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం.. నగరంలో 2 రిజర్వాయర్లు

హైదరాబాద్‌ మహా నగరంలో తాగునీటి సమస్య రాకుండా రెండు రిజర్వాయర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. శుక్రవారం (నవంబర్ 10) ఆయ్న శాసన మండలిలో మాట్లాడుతూ.. నగరంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

TNN 10 Nov 2017, 4:36 pm
హైదరాబాద్‌ మహా నగరంలో తాగునీటి సమస్య రాకుండా రెండు రిజర్వాయర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. శుక్రవారం (నవంబర్ 10) ఆయ్న శాసన మండలిలో మాట్లాడుతూ.. నగరంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. శామీర్‌పేట మండలం కేశవాపురంలో 10 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌, చౌటుప్పల్‌ వద్ద 10 టీఎంసీల సామర్థ్యంతో మరో రిజర్వాయర్‌ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వీటి నిర్మాణానికి త్వరలోనే టెండర్లు ఆహ్వానించనున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో డ్రింకింగ్‌ వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటు కోసం చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గోదావరి, కృష్ణా నీటిని అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Samayam Telugu minister ktr talks in assembly on hyderabad drinking water
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం.. నగరంలో 2 రిజర్వాయర్లు


ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకొని భాగ్య నగర పూర్వ వైభవానికి కృషి చేస్తామని కేటీఆర్ చెప్పారు. నగరంలోని నాలాలపై అక్రమ కట్టడాలు వెలిశాయని, గండిపేట, ఉస్మాన్‌సాగర్‌ చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని ఆయన తెలిపారు. వీటన్నింటికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీలో వివిధ అంశాలపై చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో చనకా - కోరటా బ్యారేజీ, సిజేరియన్ శస్త్ర చికిత్స, వర్కింగ్ జర్నలిస్టులు, హోంగార్డులకు ఉచిత ప్రమాద బీమా తదితర అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానం ఇచ్చారు. అనంతరం రైతు సమన్వయ సమితులు, ఎకరానికి రూ. 8 వేల పెట్టుబడిపై స్వల్ప కాలిక చర్చజరిగింది. ఈ చర్చ తర్వాత సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.