యాప్నగరం

ఏ కంపెనీలో చూసినా ఏపీవాళ్లే ఎక్కువ: లోకేశ్

ప్రపంచంలో ఏ కంపెనీలో చూసినా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతే ఎక్కువగా ఉంటున్నారని లోకేశ్ అన్నారు. ఏపీలో ఐటీ కంపెనీలు ప్రారంభించడం వల్ల..

TNN 10 Jul 2017, 12:35 pm
హైదరాబాద్‌ తరహాలో సాఫ్ట్‌వేర్‌ సంస్థలన్నీ ఒకే ప్రాంతంలో ఉండేలా విజయవాడ, విశాఖ నగరాల్లో ఐటీ పార్క్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. సోమవారం (జులై 10) ఆయన విజయవాడలో 7 ఐటీ కంపెనీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. 2019లోగా రాష్ట్రంలో ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తాను మంత్రి పదవి చేపట్టిన 90 రోజుల్లోనే 3 వేల మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించినట్లు లోకేశ్ పేర్కొన్నారు. తాజాగా ప్రారంభించిన సంస్థల ద్వారా 300 మందికి ఉద్యోగాలు రానున్నట్లు తెలిపారు.
Samayam Telugu minister nara lokesh inagurates 7 it companies in vijayawada
ఏ కంపెనీలో చూసినా ఏపీవాళ్లే ఎక్కువ: లోకేశ్


రాష్ట్రంలో త్వరలో పెద్ద ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించనున్నాయని లోకేశ్‌ తెలిపారు. ఈ ఏడాది నవంబర్‌ చివరికల్లా అమరావతి నుంచి హెచ్‌సీఎల్‌ కార్యకలాపాలు ఆరంభమవుతాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి దేశంలో ఎక్కడా లేని విధంగా పాలసీలు రూపొందించామని లోకేశ్ పేర్కొన్నారు. డెవలపర్స్‌కు 50 శాతం అద్దె ప్రభుత్వమే చెల్లిస్తోందని ఆయన అన్నారు.

ప్రపంచంలో ఏ కంపెనీలో చూసినా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతే ఎక్కువగా ఉంటున్నారని లోకేశ్ అన్నారు. ఏపీలో ఐటీ కంపెనీలు ప్రారంభించడం వల్ల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మరింత పెరుగుతాయన్నారు. చిన్న సంస్థలను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో అవి పెద్ద కంపెనీలుగా మారతాయని లోకేశ్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.