యాప్నగరం

జగన్ ఎన్డీయేలోకి వస్తే సీఎంను చేస్తాం: కేంద్ర మంత్రి

వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌ను తాము ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నామని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తెలిపారు. తమతో కలిస్తే ఆయన సీఎం అయ్యేందుకు సహకరిస్తామని అథవాలే చెప్పారు.

Samayam Telugu 14 Jul 2018, 4:25 pm
కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌ను తాము ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. తమతో కలిస్తే ఆయన సీఎం అయ్యేందుకు సహకరిస్తామని అథవాలే చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో మోదీ, అమిత్‌ షాతో తాను మాట్లాడతానని వెల్లడించారు. శనివారం (జులై 15) హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన అథవాలే మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu Ramdas


ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగడంపైనా అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొందరపాటుగా వ్యవహరించారని అన్నారు. టీడీపీ ఎన్డీయేలోనే కొనసాగి ఉంటే ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించేవారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

పనిలో పనిగా రాహుల్‌పై వ్యంగ్యస్త్రాలు సంధించారు కేంద్ర మంత్రి అథవాలే. రాజ్యాంగాన్ని తానూ, మోదీ రక్షిస్తామని.. కాంగ్రెస్‌ పార్టీని రాహులే రక్షించుకోవాలని ఆయన ఎవ్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధ చట్టం కొంతమేర దుర్వినియోగం అవుతున్న మాట వాస్తవమేనని ఆయన అన్నారు. అయినప్పటికీ నేటికీ పలు చోట్ల దళితులు వేధింపులను ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. దేశంలో కులాంతర వివాహాలు పెరిగితే.. మహిళలపై అత్యాచారాలు తగ్గుతాయంటూ గతంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.