యాప్నగరం

పట్టపగలు నడిరోడ్డుపై బైక్‌లతో విన్యాసాలు.. పాతబస్తీలో రెచ్చిపోతోన్న మైనర్లు

చాంద్రాయణగుట్ట నుంచి ఐఎస్ సదన్‌కు వెళ్లే దారిలో రోజూ సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల మధ్య కొంత మంది మైనర్లు ఇలా నడిరోడ్డుపై స్టంట్లు చేస్తూ ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తున్నారు.

Samayam Telugu 16 Jun 2019, 9:02 pm
బైకులకు నంబర్ ప్లేట్లుండవ్.. రైడర్ల తలలకు హెల్మెట్లు ఉండవ్.. అసలు వాళ్లకు లైసెన్సులే ఉండవ్.. కానీ, రయ్ రయ్‌మని రోడ్లెక్కుతారు! ముందు చక్రం పైకిలేపి నడిరోడ్డుపై విన్యాసాలు చేస్తారు! ఒక్కో బైకుపై ముగ్గురు నలుగురు ఎక్కి ఇష్టమొచ్చినట్లు గింగిరాలు తిప్పుకుంటూ దూసుకెళ్తారు. ఇదీ హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీలో మైనర్ కుర్రాళ్ల ఓవరాక్షన్. పాతబస్తీ కుర్రాళ్లకు ఇది కొత్తేమీ కాదు. అయితే, తాజాగా కొందరు కుర్రాళ్లు ఇలా పట్టపగలు నడిరోడ్డుపై విన్యాసాలు చేస్తోన్న వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Samayam Telugu Stunt


చాంద్రాయణగుట్ట నుంచి ఐఎస్ సదన్‌కు వెళ్లే దారిలో రోజూ సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల మధ్య కొంత మంది మైనర్లు ఇలా నడిరోడ్డుపై స్టంట్లు చేస్తూ ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తున్నారు. వీరి విన్యాసాలతో వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులకు దొరకకుండా ఉండటానికి వీరు కావాలనే నంబర్ ప్లేట్లను తొలగిస్తున్నారు. తాజాగా బయటికి వచ్చిన వీడియోలో ఒక కుర్రాడు టీవీఎస్ అపాచీ బైక్‌ను ముందు చక్రం పైకిలేపి చాలా దూరం అలాగే పోనిచ్చాడు. మరో బైక్‌పై ముగ్గురు ప్రయాణిస్తుండగా.. అందులో ఒక కుర్రాడు ట్యాంక్‌పై ఒకవైపు కాళ్లు పెట్టుకుని కూర్చున్నాడు. ఈ ఆకతాయిల చేష్టలపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.