యాప్నగరం

స్పీకర్ గారూ.. యాక్టింగ్ మాని యాక్షన్‌లోకి దిగండి

ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు గుప్పించారు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే రోజా.

TNN 10 Nov 2017, 4:30 pm
ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు గుప్పించారు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే రోజా. శుక్రవారం ఉదయం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేను అనర్హులుగా ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంలో ఏపీ అసెంబ్లీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లా తయారైందని.. సభలో ఉన్న అధికార ప్రతిక్షాలను కలుపుకుని పోయి సమన్వయంతో నడిపించాల్సిన స్పీకర్... నాకు సంబంధం లేదు అన్నట్లుగా నటిస్తున్నారన్నారు.
Samayam Telugu mla roja fires on ap assembly speaker kodela siva prasad rao
స్పీకర్ గారూ.. యాక్టింగ్ మాని యాక్షన్‌లోకి దిగండి


ఇప్పటికైనా ఆయన యాక్టింగ్ వదిలేసి.. యాక్షన్‌లోకి దిగాలన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి వేరొక పార్టీకి సంతలో పసువుల్లా అమ్ముడైన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తుంటే.. స్పీకర్ ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని తప్పించుకోవడం దారుణం అన్నారు. అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాల్సిన స్పీకర్ తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారని త్వరలోనే బుద్ది చెబుతారన్నారు.

మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబుపైన తనదైన శైలిలో ఫైర్ అయ్యారు రోజా. తాము అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడంపై చంద్రబాబు వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయనన్నారు. తాము ఈ సమావేశాల్లో పాల్గొంటే పార్టీ ఫిరాయింపులను సమర్థించినట్టే అవుతుందని ఈ కారణం తోటే సమావేశాలు బహిష్కరించాం అని.. అంతే తప్ప చంద్రబాబుకో ఆయన తొట్టి గ్యాంగ్‌కో బయపడి కాదన్నారు.

జగన్‌ను విమర్శించే ముందు చంద్రబాబు తనను తాను పరిశీలించుకోవాలని.. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఇలాంటి ప్రతిపక్షాన్ని చూడలేదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. చంద్రబాబూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి మీకు సిగ్గుగా అనిపించడంలేదా? మీకు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి.. 45 ఏళ్ల జగన్‌కు ఎందుకు భయపడుతున్నారు? ఆయన పాదయాత్ర చేస్తుంటే ఎందుకు కుట్రలు చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఓటుకు కోట్లు కేసుకు భయపడి హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చింది చంద్రబాబు కాదా? పిల్ల నిచ్చిన మామనే వెన్ను పోటు పొడిచింది చంద్రబాబు కాదా? ఆయనకు వెన్నుపోటు అనేది వెన్నతో పెట్టి అంటూ దుయ్యపట్టారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎలాగూ ఓడిపోవడం ఖాయం అని వాళ్లు ముందే ఫిక్స్ అయ్యారు అందుకే ఇప్పటినుండి ప్రతిపక్షపాత్ర కూడా వాళ్లే పోషిస్తున్నారంటూ ఛలోక్తులు విసిరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.