యాప్నగరం

TDPకి మరో ఎమ్మెల్సీ రాజీనామా.. ఒకే జిల్లాలో రెండు షాక్‌లు

తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్. టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సతీష్.

Samayam Telugu 10 Jul 2019, 6:53 pm
తెలుగు దేశం పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరం కావడం అధిష్టానాన్ని కలవరపెడుతోంది. తాజాగా టీడీపీకి గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ అన్నం సతీష్ గుడ్ బై చెప్పారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తన రాజీనామా లేఖను పంపారు. ఎమ్మెల్సీ పదవితో పాటూ టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తనకు ఎమ్మెల్సీగా, పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
Samayam Telugu mlc


సతీష్ తన లేఖలో ‘తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యునిగా గతే 25 ఏళ్లగా మీ నాయకత్వములో పనిచేయుట ఎన్నో అనుభవాలు, క్రమశిక్షణ నేర్పాయి. తమరి నాయకత్వంలో 2014 మరియు 2019 ఎన్నికలలో. బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యునిగా పోటీచేసే అవకాశము కల్పించినందులకు కృతజ్ఞుడను. 2014 ఎన్నికల అనంతరము స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గొ ఈమ ప్రభుత్వములో అవకాశము కల్పించుట ద్వారా ప్రజలకు, పార్టీకి నిస్వార్ధంగా ఇన్నేళ్లు సేవ చేయగలిగాను. 2019 ఎన్నికల ఫలితం ద్వారా ప్రజా తీర్పును గౌరవించి, ఓటమి తదుపరి శాసనమండలి నందలి ప్రవేశించుటకు నా యొక్క ఆత్మ ప్రభోదం అంగీకరించని కారణముగా ఈ రోజున అనగా ది 10.07.2019 నా యొక్క తెలుగుదేశం పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయుచున్నాను’అని తెలిపారు.
అన్నం సతీష్ బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే కాషాయ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది. సతీష్ 2014, 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా బాపట్ల నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడారు. 2014లో ఓటమి ఎదురైనా.. అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. స్థానిక సంస్థల కోటాలో ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు.

మంగళవారం గుంటూరు జిల్లాకే చెందిన టీడీపీ సీనియర్‌ నేత చందూ సాంబశివరావు కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఈయన కూడా త్వరలో బీజేపీలో చేరతారని తెలుస్తోంది. సాంబశివరావుతో పాటూ అన్నం సతీష్‌ను రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి బీజేపీలోకి తీసుకెళుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే వీరు బీజేపీలో చేరడంపై ఇంకా క్లారిటీ రాలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.