యాప్నగరం

'విజయసాయి ఆ వింత సమస్యతో బాధపడుతున్నారు'

'వీళ్లు ఏ పదవిలో ఉన్నా.. దొరికినవి దోచుకోవాలనే రోగాన్ని సైకాలజీలో 'Kleptomania' అంటారంట. జైళ్ళలో పెట్టినా బుద్ధి మారదు. పైగా దొంగతనం తప్పేం కాదన్న భావనతో దర్జాగా తిరిగేస్తుంటారు'

Samayam Telugu 22 Jul 2019, 4:02 pm
ఏపీలో వైసీపీ-టీడీపీల మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్‌లు ట్వీట్లతో ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. టీడీపీ అవినీతికి పాల్పడిందని విజయసాయి విమర్శిస్తే.. తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ నారా లోకేష్‌ కౌంటరిస్తున్నారు. తాజాగా ఈ ట్వీట్ల యుద్ధంలోకి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా ఎంట్రీ ఇచ్చారు. విజయసాయి చేసిన ట్వీట్లకు కౌంటరిచ్చారు.
Samayam Telugu visa


‘ఎంత సంపాదించుకున్నా, ఏ పదవిలో ఉన్నా ఇంకా దొరికినవన్నీ దోచుకోవాలనే రోగాన్ని సైకాలజీలో 'Kleptomania' అంటారంట. జైళ్ళలో పెట్టినా వీరి బుద్ధి మారదు. పైగా దొంగతనం తప్పేం కాదన్న భావనతో దర్జాగా తిరిగేస్తుంటారు. A-2 విజయసాయిరెడ్డి గారి సమస్య ఇదే. పారాహుషార్!’అంటూ సెటైర్లు పేల్చారు బుద్దా వెంకన్న.
అంతకముందు చంద్రబాబు, లోకేష్‌లు టార్గెట్‌గా విజయసాయి విమర్శలు చేశారు. ‘ప్రపంచమంతా గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నందునే పవన విద్యుత్తును ఎక్కువ ధరకు కొన్నామంటూ చిట్టి నాయుడు మోకాలికీ బోడి గుండుకు ముడిపెడుతున్నాడు. నదిని పూడ్చి ఇళ్లు కట్టుకుంటే తప్పేమిటని వాదిస్తారు. దొంగలకిచ్చే నోబెల్ ప్రైజ్ ఏదైనా ఉంటే బాప్-బేటాలకు జాయింట్‌గా ఇవ్వాలి’అన్నారు.
‘చంద్రబాబు ప్రభుత్వ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి కమీషన్ల కోసం ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించారు. సహకార డెయిరీలు, విద్యాసంస్థలు, ఆర్టీసీ, ఏపీ జెన్కో, డిస్కాంలు అన్నీ దివాళా తీస్తుంటే రోగానికి చికిత్స చేయకుండా సపట్ మలాం పూసి చల్లగా జారుకున్నారు’అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.