యాప్నగరం

వైఎస్సార్సీపీలోని ఆ పెద్దతల ఎవరు?

ఒకవైపు ఫిరాయింపుదారులైన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయనందుకు గానూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ అసెంబ్లీని బహిష్కరించింది.

TNN 29 Nov 2017, 8:21 am
ఒకవైపు ఫిరాయింపుదారులైన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయనందుకు గానూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ అసెంబ్లీని బహిష్కరించింది. ఫిరాయింపుదారుల చేత రాజీనామా చేయించండి లేదా వారిపై అనర్హత వేటైనా వేయండి అనేది ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీ చేస్తున్న డిమాండ్. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ను ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు అధికార పార్టీ. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే ఉంది అధికార పక్షం. ఈ మధ్య కాలంలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. దీంతో ఫిరాయింపుదారుల సంఖ్య 23 వరకూ చేరినట్టుంది.
Samayam Telugu more defection from ysrcp in ap
వైఎస్సార్సీపీలోని ఆ పెద్దతల ఎవరు?


ఇలాంటి నేపథ్యంలో ఈ ఫిరాయింపుల పర్వం ఇంతటితో ముగియడం లేదని స్పష్టం అవుతోంది. తాజాగా ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. మరిన్ని ఫిరాయింపులు ఉంటాయన్నట్టుగా మాట్లాడారు ఆయన.

‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఒక పెద్ద తలకాయ కోసం ప్రయత్నిస్తున్నాం. అన్ని రకాలుగానూ ట్రై చేస్తున్నాం. ఆయన వచ్చి ఇటు చేరితే వైసీపీలో మిగిలేది కొంతమంది మాత్రమే..’ అని మీడియా ప్రతినిధులతో అచ్చెన్న వ్యాఖ్యానించారు. మరి ఇంతకీ ఎవరా పెద్దతల అంటే ఆయన దానికి సమాధానం ఇవ్వలేదు.

మరి ఈ మాటలను బట్టి చూస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఎవరో ముఖ్యుడికే తెలుగుదేశం పార్టీ వల వేస్తోందని స్పష్టం అవుతోంది. అదెవరు అనే అంశం ప్రస్తుతానికి సస్పెన్సే. జగన్ పాదయాత్ర ముగిసే లోపు ఆయన తమ పార్టీలోకి చేరతాడని.. అచ్చెన్న స్పష్టం చేశారు. మరి అదెవరో క్లారిటీ రావడానికి మరి కొంత సమయం పట్టేలా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.