నగరంలో నేడు అతి భారీ వర్షాలు
హైదరాబాద్ నగర ప్రజలు గురువారం అప్రమత్తంగా ఉండాలి.
TNN 15 Sep 2016, 9:23 am
హైదరాబాద్ నగర ప్రజలు గురువారం అప్రమత్తంగా ఉండాలి. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అతి తక్కవ సమయంలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపారు. నిన్న రాత్రి కేవలం రెండుగంటల్లోనే 7 సెం.మీ వర్షపాతం నమోదైంది. రోడ్లు పూర్తిగా మునిగిపోయాయి. అర్థరాత్రి కావడంతో పెద్దగా ప్రజలకు ఇబ్బందిపడలేదు. అదే వర్షం ఉదయం పూట పడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. పశ్చిమ బంగాళాఖాతంలో బలంగా ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ మొత్తాన్ని అల్పపీడన ప్రభావం కమ్ముకుంది. నేడు నిన్నటికి మించి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతుండడంతో నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.