యాప్నగరం

విజయవాడలో విషాదం.. బాలింత, శిశువు అనుమానాస్పద మృతి; ఆందోళనకు దిగిన భర్త

బిడ్డకు జన్మనివ్వడం కోసం హాస్పిటల్‌లో చేరిన మహిళ.. అదే హాస్పిటల్లో బిడ్డతో సహా ప్రాణాలు కోల్పోయింది. ఆమె ఎలా చనిపోయిందని ప్రశ్నించగా డాక్టర్లు, సిబ్బంది నుంచి సరైన సమాధానం రాలేదు.

Samayam Telugu 18 Jul 2019, 4:42 pm
విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. చిన్నమ్మ అనే మహిళ మంగళవారం డెలివరీ కోసం పాత ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. పురిటి బిడ్డతోపాటు ఆమె ప్రాణాలు వదిలింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య, బిడ్డ చనిపోయారని.. చిన్నమ్మ భర్త రాజు ఆవేదన వ్యక్తం చేశారు. నా భార్య చనిపోవడానికి కారణమేంటని రాజు ప్రశ్నించగా.. డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేదు. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
Samayam Telugu hosp.


దీంతో మృతురాలి భర్త రాజు హాస్పిటల్లో నిరసన ప్రదర్శన చేపట్టాడు. అతడికి మద్దతుగా హాస్పిటల్లో ఉన్న రోగుల బంధువులు కూడా నిరసనకు దిగారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది లో రోగులను పట్టించుకోవడం లేదంటూ ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి.. ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

గతంలో ఇదే హాస్పిటల్‌లో 24 గంటల వ్యవధిలోనే ఐదుగురు శిశువులు చనిపోవడం సంచలనమైంది. మమత అనే గర్భిణి చికిత్స కోసం హాస్పిటల్‌కు రాగా.. ఆమెను చేర్చుకోవడానికి సిబ్బంది నిరాకరించడంతో ఆమె బంధువులు ఆందోళన చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.