యాప్నగరం

విషాదం: నీటి గుంతలోకి చిన్నారులు.. కాపాడే క్రమంలో తల్లి కూడా

సరదాగా తల్లి వెంట వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటి గుంతలో పడిపోయారు. వారిని కాపాడే ప్రయత్నంలో ఆ తల్లి కూడా ప్రాణాలు విడిచింది.

Samayam Telugu 25 Nov 2018, 6:41 pm
ట్టలు ఉతకడానికి వెళ్తున్న తల్లితో మేమూ వస్తామంటూ వెంట వెళ్లారు ఇద్దరు చిన్నారులు. అక్కడ సరదాగా ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటిగుంతలో పడి మరణించారు. వారిని కాపాడే ప్రయత్నంలో తల్లి కూడా నీటి గుంతలో మునిగిపోయి మరణించింది. కృష్ణా జిల్లాలోని కంచకచర్లలో ఆదివారం (నవంబర్ 25) ఉదయం ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
Samayam Telugu quarry


కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన పరమేశ్వరి (45) ఆదివారం (నవంబర్ 25) ఉదయం దుస్తులు ఉతకడానికి గ్రామ సమీపంలోని ఓ క్వారీ గుంత వద్దకు వెళ్లింది. పరమేశ్వరి వెంట ఆమె కూతుళ్లు దుర్గ (8), మీనా(4) కూడా వెళ్లారు. క్వారీ సమీపంలోని నీటిగుంత వద్ద ఆమె దుస్తులు ఉతుకుతుండగా.. చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటిగుంతలో పడిపోయారు.

పిల్లలు నీటిగుంతలో పడిపోయిన విషయాన్ని గమనించిన పరమేశ్వరి హుటాహుటిన పరుగెత్తింది. వాళ్లను కాపాడే ప్రయత్నంలో ఆమె కూడా నీటిగుంతలో పడి పోయింది. విషాదకర రీతిలో ముగ్గురూ ప్రాణాలు విడిచారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. నందిగామ గ్రామీణ సీఐ సతీష్‌, కంచకచర్ల ఎస్సై చంద్రశేఖర్ ప్రమాద స్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తల్లి, ఇద్దరు ఆడపిల్లలు.. ఒకేసారి ముగ్గురు మృత్యువాతపడటంతో పరిటాల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.