యాప్నగరం

నేను చనిపోతే.. నా దేహంపై కాంగ్రెస్ జెండా ఉండాలి: కోమటిరెడ్డి

కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలోకి వెళుతున్నారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కోమటిరెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డితో పాటూ మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, కూడా అదే బాటలో ఉన్నారని ప్రచారం.

Samayam Telugu 13 Jun 2019, 6:26 pm

ప్రధానాంశాలు:

  • కోమటిరెడ్డి బీజేపీలోకి వెళతారని ప్రచారం
  • పార్టీ మార్పుపై స్పందించిన భువనగిరి ఎంపీ
  • తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్న ఎంపీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu afaf
భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలోకి వెళుతున్నారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కోమటిరెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డితో పాటూ మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, కూడా అదే బాటలో ఉన్నారని.. ఈ ఇద్దరు నేతలు బీజేపీ నేత రాంమాధవ్‌తో ఢిల్లీలో రహస్యంగా చర్చలు జరిపినట్లు వార్తలొచ్చాయి. సోషల్ మీడియాలోనూ ప్రచారం జరిగింది.
ఈ ప్రచారంపై కోమటిరెడ్డి స్పందించారు. తాను బీజేపీలోకి వెళుతున్నానంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తనపై కుట్రతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. తనకు రాంమాధవ్ ఎవరో కూడా తెలియదన్నారు. తాను చనిపోతే కాంగ్రెస్ జెండా దేహంపై కప్పాలని.. తన కుటుంబ సభ్యులకు చెప్పానన్నారు వెంకటరెడ్డి. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

కాంగ్రెస్ పగ్గాలు కోమటిరెడ్డి బ్రదర్స్‌కే వస్తాయని ధీమాతో ఉన్నారు వెంకటరెడ్డి. తెలంగాణలో పార్టీ బలోపేతం చేసేందుకు తమవంతు కృషి చేస్తామని.. రాబోయే రోజుల్లో తప్పకుండా పార్టీ మరింత బలపడుతుందన్నారు. తాము పార్టీలు మారే వ్యక్తులం కాదు.. కాంగ్రెస్ పార్టీ తమకు రాజకీయ జన్మనిచ్చిందన్నారు. పార్టీని వీడే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు కోమటిరెడ్డి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.