యాప్నగరం

బాబుకు ముద్రగడ 3 నెలల గడువు!

వివిధ డిమాండ్లతో విరామం..

TNN 31 Aug 2017, 12:08 pm
కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి మూడు నెలల విరామాన్ని ఇస్తున్నట్టుగా ప్రకటించారు ముద్రగడ పద్మనాభం. గత సార్వత్రిక ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా కాపులకు రిజర్వేషన్లను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని చేపట్టిన ముద్రడను ఏపీ ప్రభుత్వం కిర్లంపూడిలోనే కట్టడి చేస్తున్న విషయం విదితమే. ముద్రగడ పాదయాత్రను పోలీసులు సాయంతో పలు సార్లు అడ్డుకుంది ప్రభుత్వం. అనుమతి తీసుకుని పాదయాత్రను చేపట్టవచ్చని మంత్రులు అంటున్నా.... ప్రభుత్వానికి, ముద్రగడకు సయోధ్య కుదరడం లేదు.
Samayam Telugu mudragada new deadline for cbn
బాబుకు ముద్రగడ 3 నెలల గడువు!


ఈ నేపథ్యంలో ఇటీవల నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ మున్సిపోల్స్ లో కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ముద్రగడ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యలో రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వానికి మరో మూడు నెలల గడువు ఇస్తున్నట్టుగా ముద్రగడ ప్రకటించారు. డిసెంబర్ ఆరో తేదీ వరకూ కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి విరామం ఇవ్వాలని నిర్ణయించినట్టుగా ఆయన తెలిపారు. ఉద్యమనేతలందరి అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు.

అంబేద్కర్ వర్ధంతి వరకూ చంద్రబాబుకు గడువు ఇస్తున్నామని.. ఆ లోపు కాపులకు రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. ఆలోపు అసెంబ్లీలో తీర్మానాన్ని పెట్టాలని, కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా షెడ్యూల్ 9లో చేర్చాలని ముద్రగడ డిమాండ్ చేశారు. గడువులోగా ఈ పనులు చేయకపోతే, రిజర్వేషన్లు రాకపోతే.. తర్వాత ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.