యాప్నగరం

పాదంతో పెయింటింగ్... తెలుగమ్మాయి గిన్నిస్ రికార్డ్

పాదంతో అతిపెద్ద పెయింటింగ్ వేసిన తెలుగమ్మాయి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

TNN 30 Dec 2017, 3:06 pm
తెలుగమ్మాయి జాహ్నవి మాగంటి ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది. పాదాలతోనే అతిపెద్ద పెయింటింగ్ వేసిన ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. జాహ్నవి 140 చదరపు మీటర్ల మేర పాదంతోనే పెయింటింగ్ వేసింది. బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ వార్విక్‌లో జాహ్నవి విద్యను అభ్యసిస్తోంది. ఇప్పటి వరకూ 100 చ.మీ. పెయింటింగే వరల్డ్ రికార్డ్ కాగా.. దాన్ని 18 ఏళ్ల జాహ్నవి బద్దలుకొట్టింది. హైదరాబాద్ ల్యాంకో హిల్స్‌లో ఆమె ఈ ఫీట్ సాధించింది.
Samayam Telugu multi talented hyderabad girl creates worlds largest painting by feet
పాదంతో పెయింటింగ్... తెలుగమ్మాయి గిన్నిస్ రికార్డ్


పెయిటింగ్ వేయడాన్ని ఎంతో ఇష్టపడే జాహ్నవి.. చక్కగా డ్యాన్స్ చేస్తుంది. మంచి కళాకారిణి అయిన ఆమె శాస్త్రీయ సంగీతాన్ని ఆలపించడంలో దిట్ట. క్రీడల్లోనూ ప్రావీణ్యం ఉన్న ఆమె జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ ప్లేయర్ కావడం విశేషం. అరుదైన విషయం ఏంటంటే.. తను డ్యాన్స్ చేస్తున్నప్పుడే పెయింటింగ్ వేయగలదు. అలా నృత్యం చేస్తూ నెమలి ఫించం, తామర పుష్పాలను ఆమె పాదంతోనే గీసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.