యాప్నగరం

హైదరాబాద్‌లో మరిన్ని భూప్రకంపనలు వచ్చే అవకాశం

ఇటీవల బోరబండ ప్రాంతంలో సంభవించిన భూప్రకంపనలపై నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనాన్ని మొదలుపెట్టింది.

TNN 23 Oct 2017, 4:52 pm
ఇటీవల బోరబండ ప్రాంతంలో సంభవించిన భూప్రకంపనలపై నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనాన్ని మొదలుపెట్టింది. బోరబండ, రహ్మత్ నగర్ సహా నాలుగు ప్రాంతాల్లో భూకంప పరిశీలన కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎన్జీఆర్ఐ సీనియర్ శాస్త్రవేత్త శ్రీనగేశ్ మాట్లాడుతూ, శుక్రవారం రాత్రి నుంచి 20కి పైగా భూప్రకంపనలను గుర్తించామని తెలిపారు. మరిన్ని భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జోన్-2 పరిధిలో హైదరాబాద్ ఉందని... ఇక్కడ మరిన్ని అధ్యయనాలు జరగాల్సి ఉందని తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, భూమి కింద ఉన్న పగళ్లు కారణంగా భూప్రకంపనలు వచ్చాయని, దీనిపై మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. అలాగే భూకంపాల విషయంలో జోన్-2లో హైదరాబాద్ నగరం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.