యాప్నగరం

Srisailam: శ్రీశైలం ఆలయం అధికారిపై హత్యాయత్నం.. పరిస్థితి విషమం

శ్రీశ్రైలం ఆలయ అధికారిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడిచేసి గాయపర్చిన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈఓ కలిసి బయటకు వస్తున్న ఆయనపై దాడిచేశారు.

Samayam Telugu 12 Mar 2019, 9:32 am
ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశ్రైలం ఆలయ అధికారిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడిచేసి గాయపర్చారు. సోమవారం సాయంత్రం ఈఓ కలిసి అక్కడ నుంచి బయటకు వస్తున్న ఆలయ పీఆర్వో శ్రీనివాస్‌పై దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఆయన కళ్లలో కారంకొట్టి విచక్షణారహితంగా కత్తితో పొట్టలో పొడవటంతో తీవ్ర గాయాలపాలయ్యారు. శ్రీనివాస్‌పై దాడికి పాల్పడిన యువకుడ్ని స్థానికులు వెంటాడి పట్టుకుని, ఆలయ సెక్యూరిటీ ద్వారా పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన పీఆర్వోను తొలుత వైద్యం కోసం దేవస్థానం హాస్పిటల్‌కు తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు రమేశ్ హాస్పిటల్‌లో వైద్యం అందిస్తున్నారు. శ్రీనివాస్ పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. అయితే, ఆయనకు వెంటిలేషన్‌పై చికిత్స అందజేస్తున్నట్టు తెలిపారు.
Samayam Telugu sri2


మరో 48 గంటల తర్వాతే ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వస్తుందని, అంతవరకు ఏమీచెప్పలేమని అన్నారు. ఇక, స్థానిక వ్యక్తి ప్రోద్బలంతోనే శ్రీనివాస్‌పై దాడిచేసినట్టు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించినట్టు సమాచారం. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు మిగతా వారి కోసం గాలిస్తున్నారు. నిందితుల్ని కర్నూలు వాసులుగా గుర్తించారు. అయితే, దాడికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని స్థానిక ఎస్సై తిమ్మయ్య తెలిపారు. ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నమోదుచేసినట్టు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.