యాప్నగరం

మరి, మోదీపై బీజేపీ సర్వే బోగస్‌దేనా?: కేసీఆర్

తాను చేయించిన సర్వే ముమ్మాటికీ వాస్తవమని తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు.

Samayam Telugu 29 May 2017, 7:55 pm
తాను చేయించిన సర్వే ముమ్మాటికీ వాస్తవమని తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. కాంగ్రెస్ నేతలకు ఆత్మవిశ్వాసం ఉంటే రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని ఆయన సవాల్ విసిరారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డిలు తమ అనుచరులతో కలిసి కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Samayam Telugu my survey is genuine reiterates ts cm kcr
మరి, మోదీపై బీజేపీ సర్వే బోగస్‌దేనా?: కేసీఆర్


ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఇటీవల తాను చేయించిన సర్వే ఫలితాలను వెల్లడిస్తే ప్రతిపక్ష నేతలు భయందోళన చెందుతున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ‘మా సర్వే భోగస్ అయితే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై బీజేపీ చేయించిన సర్వే కూడా బోగస్‌దేనా?’ అని ప్రశ్నించారు.

కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణ ప్రజలను ఏడింపిచాయన్నారు. పార్టీలో చేరిన రమేష్ రాథోడ్, రవీందర్ రెడ్డిల రాజకీయ భవిష్యత్ కు తనది హామీ అని కేసీఆర్ భరోసా ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.