యాప్నగరం

మాజీ స్పీకర్ నాదెండ్ల హౌస్ అరెస్ట్

విజయవాడ: ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ తలపెట్టిన ధర్నాను పోలీసులు అడుగడునా అడ్డుతగులుతున్నారు.

TNN 23 May 2016, 3:32 pm
ప్రత్యేక హోదా విషయంలోప్రభుత్వాల వైఖరికి నిరసనగా విజయవాడలో కాంగ్రెస్ తలపెట్టిన ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధర్నా కు బయల్దేరుతున్న నేతలు,కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. విజయవాడ, గుంటూరు, తెనాలి ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఈ నేపథ్యంలో ధర్నాలో పాల్గొనేందుకు బయల్దేరిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను తెనాలి లోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో నాదెండ్ల అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో తెనాలి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ధర్నా చేపట్టే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు... నిరసన తెలిసేందుకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతల నుంచి ప్రతిఘటన ఎదురైనప్పటికీ పోలీసులు తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు . భద్రతా కారణాల దృష్ట్యా కాంగ్రెస్ ధర్నా నిర్వహించేందుకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.