యాప్నగరం

హరికృష్ణ మరణం.. ఏపీలో రెండు రోజులు సంతాప దినాలు

మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ మృతిపై ఏపీ ప్రభుత్వం సంతాపాన్ని తెలిపింది. హరికృష్ణ మృతికి సంతాపంగా రెండు రోజుల పాటూ సంతాప దినాలుగా ప్రకటించింది.

Samayam Telugu 29 Aug 2018, 6:13 pm
మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ మృతిపై ఏపీ ప్రభుత్వం సంతాపాన్ని తెలిపింది. హరికృష్ణ మృతికి సంతాపంగా రెండు రోజుల పాటూ సంతాప దినాలుగా ప్రకటించింది. బుధవారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రెండు రోజుల పాటూ అధికారిక కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. అలాగే జాతీయ జెండాను కూడా అవనతనం చేయనున్నారు.
Samayam Telugu Hari Krishna


ఇటు హరికృష్ణ అంత్యక్రియల్ని అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. హరికృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ జోషికి సూచించారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో గురువారం హరికృష్ణ అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.