యాప్నగరం

‘లోకేశ్ సీఎం అయితే.. తాము తెలుగు రోహింగ్యాలమవుతాం’

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులు క్రమంగా రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. అవార్డుల్లో తమకు అన్యాయం జరిగిందని విమర్శించిన విషయం తెలిసిందే.

TNN 21 Nov 2017, 2:52 pm
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులు క్రమంగా రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. అవార్డుల్లో తమకు అన్యాయం జరిగిందని విమర్శించడం, దీనికి ప్రతిగా నంది అవార్డులపై ఏపీలో ఆధార్ కార్డు, ఓటు హక్కు లేనివాళ్లే విమర్శలు చేస్తున్నారని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించడం విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తాము నాన్-ఆంధ్రా రెసిడెంట్స్ అయితే లోకేశ్ ఎవరని ఎదురు ప్రశ్నించారు. ఏపీ ప్రజలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడూ తిట్టలేదని, రాజకీయ నాయకులను మాత్రమే తిట్టారని పోసాని అన్నారు. లోకే‌శ్‌కు ఉన్న మనస్తత్వం తెలంగాణ ప్రజలకు ఉంటే... మమ్మల్ని తరిమికొట్టేవారని ఎద్దేవా చెప్పారు. తెలంగాణ వాసులు చాలా దయార్థ హృద‌యుల‌ని, అమాయకులని ఈ విషయంలో వారికి తాను పాదాభివందనం చేస్తున్నానని అన్నారు.
Samayam Telugu nandi awards contaversy actor posani krishnamurali fires on nara lokesh
‘లోకేశ్ సీఎం అయితే.. తాము తెలుగు రోహింగ్యాలమవుతాం’


నారా లోకేష్ మంత్రి కావడం తమ ఖర్మ అని, ఆయన ముఖ్యమంత్రి అయితే... తాము తెలుగు రోహింగ్యాలమవుతామని విమర్శించారు. తెలంగాణకు పన్నులు కడుతున్నంత మాత్రాన తాము ఏపీ గురించి మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో మీకు ఇళ్లు, వ్యాపారాలు లేవా? అని నిలదీశారు. ఒకటి రెండు విమర్శలు చేసినంత మాత్రాన అవార్డులను ఎత్తేస్తారా అని మండిపడ్డారు. తనకు ప్రకటించిన నంది అవార్డును తిరస్కరిస్తున్నానని... ఐవీఆర్ఎస్ ద్వారా నంది అవార్డులు ఇస్తే, అప్పుడు తీసుకుంటానని ఆయన ఉద్ఘాటించారు. ప్రస్తుతం ప్రకటించిన నంది అవార్డులను రద్దు చేయాలని, ఐవీఆర్ఎస్ ద్వారా మళ్లీ ఎంపిక చేయాలని పోసాని డిమాండ్ చేశారు.

నీకు అసలు స్పృహ‌ ఉందా... 2014 నుంచి 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని... నువ్వు తాగి మాట్లాడవా, చదువుకున్నవాడివేనా అంటూ విమర్శించారు. మీకు ఉన్న అర్హతేంటి... మాకులేని అర్హతేంటి.... నాన్-ఏపీ వాళ్లను జ్యూరీలో సభ్యులుగా ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. నీకు తెలంగాణలో ఇళ్లుంది... పన్నులు కడతవా... ఏపీలో మంత్రి అవ్వవచ్చు కానీ, మేము ప్రశ్నించకూడదా అని విమర్శించారు. ఇతర పార్టీలో గెలిచిన వారిని టీడీపీలో చేర్చుకున్నందుకు వైసీపీ వాళ్లు రాద్ధాంతం చేస్తే పట్టించుకోలేదు కానీ, నందులపై విమర్శిస్తే వాటి ఎత్తేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.