యాప్నగరం

నంద్యాలపై లగడపాటి సర్వే: టీడీపీదే గెలుపు

నంద్యాల ఉప ఎన్నికపై తమ టీమ్ పరిశీలన జరిపి, టీడీపీ విజయం ఖాయమని తెలిపిందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు.

TNN 24 Aug 2017, 12:17 pm
నంద్యాల ఉప ఎన్నికపై తమ టీమ్ పరిశీలన జరిపి, టీడీపీ విజయం ఖాయమని తెలిపిందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు స్పష్టతనిచ్చారు. ప్రీ పోలా? లేక ఎగ్జిట్ పోలా? అనేది పాయింట్ కాదని... ఇది తమ టీమ్ అభిప్రాయమని ఆయన తెలియజేశారు. నామినేషన్ ప్రక్రియ మొదలు కాక ముందు, ఆ తర్వాత, పోలింగ్ జరిగిన రోజున తమ సభ్యులు నంద్యాలలో సర్వే జరిపారని... ఇవన్నీ జరిగిన తర్వాతే గెలుపు ఎవరిదనే విషయాన్ని తనకు తెలియజేశారని పేర్కొన్నారు. టీడీపీ గెలుపు అనేది తన వ్యక్తిగత అభిప్రాయం కాదని, తన టీమ్ అంచనా మాత్రమేనని వివరించారు. రాష్ట్రంలో మూడేళ్ల తర్వాత జరిగిన ఎన్నిక కావడంతోనే నంద్యాల ఉప ఎన్నికకు ఇంతటి ప్రచారం లభించిందని అన్నారు.
Samayam Telugu nandyal by election ex mp lagadapati rajgopal survey tdp will win
నంద్యాలపై లగడపాటి సర్వే: టీడీపీదే గెలుపు


ప్రజలకు సేవ చేయాలనే భావనతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలతోనే మమేకమై జీవించానని... కొన్ని ప్రత్యేక కారణాల వల్ల తాను రాజకీయాలను దూరంగా ఉంటున్నానని లగడపాటి అన్నారు. విభజన తర్వాత కొన్ని రోజులపాటు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ... ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలు శాంతియుతంగా కలసిమెలసి ఉంటున్నారని, ఇది ఎంతో సంతోషించదగ్గ పరిణామమని పేర్కొన్నారు.

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ బుధవారం సాయంత్రం ఓ వార్త పత్రికతో మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీదే విజయమని అన్నారు. పోలింగ్‌ ముగిశాక ఓటింగ్‌ సరళిపై ఆయన మాట్లాడుతూ ఓటింగ్‌ శాతం పెరిగినందున.. ఫలితంలో మార్పు వస్తుందని, వైసీపీ విజయం సాధిస్తుందనడం సరికాదన్నారు. పోలింగ్‌ శాతం పెరిగినా టీడీపీ 10% ఓట్ల మెజారిటీని సాధిస్తుందని తెలిపారు. గురువారం నాటికి మెజారిటీపై స్పష్టత వస్తుందన్నారు. నంద్యాలలో 1,73,335 మంది ఓటు వేసినందున.. టీడీపికి 17,333 ఓట్ల మెజారిటీ రావచ్చని ఇది 15 వేలైనా కావొచ్చు లేదా 20 వేలకైనా వెళ్లొచ్చని తెలిపారు. ఈ ఉప ఎన్నికను టీడీపీ, వైసీపీ ప్రతిష్ఠాత్మకంగాతీసుకున్నందునే పోలింగ్‌ శాతం పెరిగిందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.