యాప్నగరం

సస్పెన్స్ కు నేటితో తెర.. నంద్యాల్లో హై టెన్షన్!

మరి కాసేపట్లో ఫుల్ క్లారిటీ..

TNN 28 Aug 2017, 7:43 am
దాదాపు రెండున్నర నెల నుంచి వార్తల్లో ప్రముఖమైన అంశంగా నిలిచిన నంద్యాల ఉప ఎన్నిక సస్పెన్స్‌కు నేటితో తెరపడనుంది. గెలుపు ఎవరిది? విజేత ఎవరు? అనే అంశాలపై మరి కాసేపట్లో స్పష్టత రానుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఢీ అంటే ఢీ అన్నట్టుగా పోరాడిన ఈ బై పోల్ లో ప్రజాదరణ ఎటువైపు మొగ్గిందో కౌంటింగ్ తో తేలిపోనుంది. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఉప ఎన్నిక కౌంటింగ్ జరుగుతోంది.
Samayam Telugu nandyal bypoll counting starts
సస్పెన్స్ కు నేటితో తెర.. నంద్యాల్లో హై టెన్షన్!


ముందుగా పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎంల ద్వారా కౌంటింగ్ జరగనుంది. మొత్తం 19 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. ప్రతి రౌండ్ కూ ఫలితాన్ని ఎల్ఈడీ స్క్రీన్ల మీద డిస్ ప్లే చేస్తున్నారు. 1,73,189 ఓటర్లు నంద్యాల బై పోల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయం మీద ఇరు పార్టీలూ ఒకే ధీమాతో ఉన్నాయి.

ఇక ఉప ఎన్నిక కౌంటింగ్ నేపథ్యంలో నంద్యాల్లో హై టెన్షన్ నెలకొని ఉంది. ఎవరు గెలిచినా.. అల్లర్లు జరుగుతాయేమో అనే భయాందోళనలు నెలకొని ఉన్నాయి. పోలింగ్ తర్వాత కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫలితం ప్రకటించిన తర్వాత మరేం జరుగుతుందో అని ప్రజలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ముందస్తుగా భారీభద్రతా ఏర్పాట్లు చేశారు. పట్టణంలో 144 సెక్షన్ విధించారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.