యాప్నగరం

బీజేపీ పుండుపై.. కేశినేని కారం..

తను చేసిన వ్యాఖ్యలు బహిరంగ సభలో కాదని, కార్యకర్తల సమావేశంలో అని, కార్యకర్తల్లో విశ్వాసం నింపడానికే అలా మాట్లాడాను అని

TNN 24 May 2017, 3:56 pm
భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు వల్లనే తన మెజారిటీ తగ్గిందన్న తన వ్యాఖ్యలకు కట్టుబడినట్టుగా ప్రకటించారు విజయవాడ ఎంపీ, తెలుగుదేశం నేత కేశినేని నాని. ఇటీవల కేశినేని ఈ వ్యాఖ్యలు చేయగా.. భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందించింది. కేశినేని పొత్తు ధర్మానికి విఘాతం కలిగిస్తున్నారని.. ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయమా లేక తెలుగుదేశం పార్టీ అభిప్రాయమో చెప్పాలని బీజేపీ నేతలు ప్రశ్నించారు. దానిపై కేశినేని ఇప్పటికే ఒకసారి స్పందించారు కూడా.
Samayam Telugu nani adds salt on bjp injuries
బీజేపీ పుండుపై.. కేశినేని కారం..


‘ఎంపీ మాట్లాడితే వ్యక్తిగతం అవుతుందా లేక పార్టీ అభిప్రాయం అవుతుందా?’ అని కేశినేని ఎదురు ప్రశ్నించారు. మరోసారి స్పందిస్తూ.. తను వాస్తవాలే మాట్లాడాను అని, తను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టుగా బుధవారం ఆయన ప్రకటించారు. బీజేపీతో పొత్తు లేకుండా ఉంటే మరింత మెజారిటీ వచ్చేదని కేశినేని వ్యాఖ్యానించారు. తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అధిష్టానం అని.. తన వ్యాఖ్యల పట్ల ఆయన వివరణ కోరితే సమాధానం చెబుతానని అన్నారు.

తల పగులుతుందన్నా కొండను ఢీ కొట్టే తత్వం తనదని కేశినేని చెప్పుకొచ్చారు. తను చేసిన వ్యాఖ్యలు బహిరంగ సభలో కాదని, కార్యకర్తల సమావేశంలో అని, కార్యకర్తల్లో విశ్వాసం నింపడానికే అలా మాట్లాడాను అని ఎంపీ చెప్పడం గమనార్హం. ఈ మాటలతో కొంత తగ్గినట్టుగా కనిపించినా.. తను వాస్తవాలే చెప్పానని అనడం ద్వారా బీజేపీ నేతల పుండుపై కారం చల్లినట్టుగా వ్యవహరించారు నాని.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.