యాప్నగరం

నువ్వు పర్ఫెక్ట్.. నారా లోకేశ్ బర్త్ డే విషెస్, జగన్‌కు కాదు సుమా!

పర్ఫెక్షన్‌కు ఏదీ దగ్గరగా రాదని చెబుతుంటారు. కానీ అలా చెప్పిన వారెవరూ నిన్ను చూడలేదు. హ్యాపీ బర్త్ డే అంటూ నారా లోకేశ్ తన భార్యామణికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Samayam Telugu 21 Dec 2018, 1:30 pm
డిసెంబర్ 21.. వైఎస్ జగన్ పుట్టిన రోజు. తమ అధినేత పుట్టిన రోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. దేశవిదేశాల్లోని జగన్ అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న జగన్.. శ్రీకాకుళం జిల్లాలో అభిమానుల సమక్షంలో కేక్ చేశారు. సోషల్ మీడియాలో జగన్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు.
Samayam Telugu nara lokesh


నారా లోకేశ్ భార్య, నందమూరి బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి పుట్టిన రోజు కూడా నేడే కావడం విశేషం. తన భార్యకు బర్త్ డే విషెస్ చెబుతూ లోకేశ్ ట్వీట్ చేశారు. ‘పర్ఫెక్షన్‌కు ఏదీ దగ్గరగా రాదని చెబుతుంటారు. కానీ అలా చెప్పిన వారెవరూ నిన్ను చూడలేదు. హ్యాపీ బర్త్ డే బ్రాహ్మణి’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
దంపతులిద్దరూ కొడుకుతో కలిసి దిగిన ఫొటోను లోకేశ్ ట్వీట్ చేశారు. నారా బ్రాహ్మణికి జగన్ ఫ్యాన్స్ కూడా బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్లు చేయడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.