యాప్నగరం

పల్లె రమ్మంటే.. పట్నం తెమ్మంటుంది: లోకేశ్

లోకేశ్ భాషా ప్రయోగంపై పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. ఆయన ఒక్కసారిగా ఇలా మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరచడం విశేషం..

TNN 19 Apr 2017, 3:36 pm
పల్లె తల్లి లాంటిది.. పట్నం ప్రియురాలు లాంటిదట. పల్లె రమ్మంటే... పట్నం తెమ్మంటుందట. ఏపీ పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్.. తూర్పు గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా ఈవిధంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సామర్లకోట మండలం జి.మేడపాడులో ఆయన ఇవాళ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ చెత్తతో ఎరువులు తయారీ చేసే కేంద్రాన్ని పరిశీలించారు. రూ. 5 కోట్లతో నిర్మించే తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ... ‘పల్లె ప్రజల సమస్యలను అర్థం చేసుకోకుండా ఎవరూ రాజకీయాల్లో ఎదగలేరు. పల్లెటూరుకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లే అని పెద్దలు చెబుతారు’ అని అన్నారు. ​లోకేశ్ భాషా ప్రయోగంపై పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. ఆయన ఒక్కసారిగా ఇలా మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరచడం విశేషం.
Samayam Telugu nara lokesh explains the difference between town and village
పల్లె రమ్మంటే.. పట్నం తెమ్మంటుంది: లోకేశ్


పల్లెలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే పంచాయతీరాజ్‌ శాఖను పదే పదే అడిగి మరీ తీసుకున్నానని లోకేశ్ చెప్పడం గమనార్హం. రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో గ్రామాల రూపురేఖలు మారిపోతాయని ఆయన అన్నారు. గ్రామాలను సిమెంటు రోడ్లు, ఎల్‌ఈడీ వెలుగులతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.