యాప్నగరం

ఏపీలో ఆధార్, ఓట‌ర్ కార్డు లేనివారు విమ‌ర్శ‌లు చేస్తే ఎలా?

గతవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. మూడేళ్ల అవార్డులను ఒకసారి ప్రకటించడంతో కొంత గందరగోళం నెలకుంది.

TNN 20 Nov 2017, 5:22 pm
గతవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. మూడేళ్ల అవార్డులను ఒకసారి ప్రకటించడంతో కొంత గందరగోళం నెలకుంది. 2014 అవార్డులపైనే అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. మనం సినిమాను కాదని లెజెండ్‌ను ఉత్తమ చిత్రంగా ఎంపికచేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఈ విష‌యంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంద‌రు హైద‌రాబాద్‌లో కూర్చొని ఏపీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఆధార్, ఓట‌ర్ కార్డు లేని వారు కూడా ప్ర‌త్యేక హోదా, నంది అవార్డుల‌పై విమ‌ర్శ‌లు చేస్తే ఎలా? అని ప్ర‌శ్నించారు.
Samayam Telugu nara lokesh made serious comments on nandi awards controversy
ఏపీలో ఆధార్, ఓట‌ర్ కార్డు లేనివారు విమ‌ర్శ‌లు చేస్తే ఎలా?


నంది అవార్డుల ప్ర‌క‌ట‌న‌పై విమ‌ర్శ‌లు రావడంతో సీఎం చంద్ర‌బాబు నాయుడు చాలా బాధ‌ప‌డ్డార‌ని లోకేశ్ తెలిపారు. హైద‌రాబాద్‌లో కూర్చుని ఏం చేయాలో చెబితే ప్ర‌జ‌లు హ‌ర్షించ‌బోర‌ని వ్యాఖ్యానించారు. నంది అవార్డుల‌పై విమ‌ర్శ‌లు చేస్తోంది ఇద్ద‌రు, ముగ్గురు మాత్ర‌మేన‌ని అన్నారు. మూడేళ్ల అవార్డులు ఒకేసారి ప్రకటించినందుకు మాపై విమర్శలా, అసలు అవార్డులు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ముందా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో స్థానికతలేని వారికి మాపై విమర్శలు చేసే హక్కులేదని అన్నారు. నాన్-రెసిడెంట్ ఆంధ్రావాళ్లు మాత్రమే మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా గురించి ధర్నా చేయాలంటే ఢిల్లీకి వెళ్లి చేయాలని మంత్రి లోకేశ్ సూచించారు. ప్రత్యేక హోదాపై ధర్నా చేయడానికి ఉదయం హైదరాబాద్‌ నుంచి విమానంలో విజయవాడకు వచ్చి, ధర్నా అయిన తిరిగి వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.