యాప్నగరం

KTR కుట్ర, ఏపీని అతలాకుతలం చేసేందుకే టీఆర్‌ఎస్ వస్తోంది: లోకేశ్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్ ఘాటుగా బదులిచ్చారు. ఏపీని అతలాకుతలం చేసేందుకే జగన్‌తో కలిసి వస్తున్నారని మండిపడ్డారు.

Samayam Telugu 23 Feb 2019, 10:31 pm
తెలుగుదేశం ఓటమి కోసం పని చేసే కేసీఆర్, ఆయన సహచరులకు భంగపాటు తప్పదని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఓటమి తప్పదంటూ టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ చేసిన వాఖ్యలపై నారా లోకేశ్‌ ట్విటర్‌ ద్వారా ఘాటుగా స్పందించారు. ఒక్క నాయకుడిని ఎదుర్కోలేక ముగ్గురు నాయకులు ఒక్కటై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమంలో పోటీ పడలేక, జగన్‌తో చేతులు కలిపి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే భారీ ప్రణాళికలతో టీఆర్‌ఎస్ ముందుకొస్తోందని.. కేటీఆర్ మాటల్లో ఆ విషయం తేలిపోయిందని లోకేశ్ పేర్కొన్నారు.
Samayam Telugu lokesh


‘ఢిల్లీ మోదీ, తెలంగాణ మోదీ కేసీఆర్, ఆంధ్రా మోదీ జగన్‌కు కలలో కూడా చంద్రబాబే గుర్తుకొస్తున్నారు. ఆ విషయం ఈ రోజు కేటీఆర్ మాటల్లో బయటపడింది. ఫెడరల్ ఫ్రంట్ అంటూ చక్రం తిప్పి 420 పార్టీతో జత కట్టిన కేసీఆర్.. తెలంగాణకే పరిమితమై చతికలపడ్డారు’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.


ఢిల్లీలో కాదు, అమరావతిలోనూ చక్రం తిప్పలేరు..
రాబోయే ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వంద శాతం ఓడిపోతారని కేటీఆర్ జోస్యం చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కాదు కదా, అమరావతిలో కూడా చక్రం తిప్పే పరిస్థితులు లేవని ఆయన విమర్శించారు. శనివారం (ఫిబ్రవరి 23) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పారిశ్రామికవేత్తలపై ఐటీ దాడులు జరిగితే చంద్రబాబుకు ఏమైందని ప్రశ్నించారు. దేశంలో అన్ని రాష్ర్టాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయని.. అలాంటప్పుడు ఒక్క చంద్రబాబుకే ఉలికిపాటు ఎందుకన్నారు.

‘హైదరాబాద్‌లో ఆస్తులుంటే వైసీపీలో చేరాలని మేం చెబుతున్నామా? అలాగైతే.. హైదరాబాద్‌లో చంద్రబాబుకు కూడా ఆస్తులు ఉన్నాయి కదా. చంద్రబాబు కలలో కూడా సీఎం కేసీఆర్‌నే కలవరిస్తున్నారు. కేంద్రం అన్యాయం చేసిందనేది చంద్రబాబే.. మేమే నంబర్‌వన్‌ అనేది కూడా ఆయనే. ఐదేళ్లలో చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో చెప్పాలి’ అని కేటీఆర్‌ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.