యాప్నగరం

ఎమ్మెల్సీగా లోకేష్ ప్రమాణస్వీకారోత్సవం

చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

TNN 28 Mar 2017, 3:32 pm
తెలుగు దేశం అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇప్పటికే తెదేపా జాతీయ కార్మదర్శిగా ఉన్నారు లోకేశ్. ఎమ్మెల్సీగా అతని ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 30న ఉదయం 9.45 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి లోకేశ్ చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇటీవలే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోకేశ్ ఎమ్మెల్యేల కోటాలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Samayam Telugu nara lokesh to be sworn in as mlc on march 30
ఎమ్మెల్సీగా లోకేష్ ప్రమాణస్వీకారోత్సవం


కాగా ఏప్రిల్ లో ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. అందులో నారా లోకేష్ మంత్రి పదవి ఇవ్వవచ్చనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియకు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. నిజానికి భూమా నాగిరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు అనుకున్నట్టు వినికిడి. ఆయన అకస్మాత్తుగా మరణించడంతో అఖిల ప్రియకు ఛాన్స్ ఇవ్వడానికి అధిష్ఠానం మొగ్గు చూపుతుందని తెలుస్తోంది. అదే జరిగితే నారా లోకేష్, అఖిల ప్రియ యువతరం ప్రతినిధులుగా కేబినెట్ లో ప్రతిబింబించే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.