యాప్నగరం

రెడ్డి గారికి కంగ్రాట్స్: నరేంద్ర మోదీ

హాట్ హాట్‌గా జరిగిన ఎన్నికల ప్రచారం పుణ్యమా అని కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలు...

TNN 28 Aug 2017, 7:19 pm
హాట్ హాట్‌గా జరిగిన ఎన్నికల ప్రచారం పుణ్యమా అని కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలు గతంలోనే జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకి ఎక్కాయి. ఇక ఈ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డిని అభినందిస్తూ తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ కూడా ఓ విధంగా మరోసారి నంద్యాలకి నేషనల్ న్యూస్ హెడ్‌లైన్స్‌లో చోటు లభించేలా చేసింది. భూమా బ్రహ్మానంద రెడ్డితోపాటు తమ కూటమితో జత కట్టిన టీడీపీ శ్రేణులకి కూడా అభినందనలు తెలిపారు మోదీ.
Samayam Telugu narendra modi congratulates bhuma brahmananda reddy for winning nandyal bypoll
రెడ్డి గారికి కంగ్రాట్స్: నరేంద్ర మోదీ

Congratulations to Bhuma Brahmananda Reddy Garu & our valued NDA ally, TDP for the big victory in the Nandyal by-poll. @ncbn— Narendra Modi (@narendramodi) August 28, 2017
భూమా నాగిరెడ్డి మృతి అనంతరం ఆయన ప్రాతినిధ్యం వహించిన నంద్యాల నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఇవాళే వెల్లడైన సంగతి తెలిసిందే. నువ్వా, నేనా అన్నట్టుగా సాగిన ఈ ఎన్నికల రణంలో భూమా బ్రహ్మానంద రెడ్డి విజయం సాధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.