యాప్నగరం

హుస్సేన్ సాగ‌ర్‌లో ‘ప్ర‌ళ‌యం’.. సైన్యం ‘సహాయం’

హుస్సేన్ సాగర్‌ ఊహించని ముప్పు బారిన పడింది. ఇళ్లు, భవనాలు, విద్యా సంస్థలు, వాహనాలు ఒక్కసారిగా నీట మునిగిపోయాయి. అందులో చిక్కుకున్న ప్రజలు కేకలు వేస్తూ సాయం కోసం అర్థించారు. వెంటనే రంగంలోకి దిగిన సైన్యం.. స్పీడు బోట్ల సాయంతో ముప్పు బారిన పడ్డ ప్రజలను రక్షించింది. హెలికాప్టర్ల నుంచి తాడు సాయంతో సాగర్‌లోకి దిగిన సైనికులు.. అక్కడి నుంచి పడవల ద్వారా..

TNN 23 Sep 2017, 1:34 pm
హుస్సేన్ సాగర్‌ ఊహించని ముప్పు బారిన పడింది. ఇళ్లు, భవనాలు, విద్యా సంస్థలు, వాహనాలు ఒక్కసారిగా నీట మునిగిపోయాయి. అందులో చిక్కుకున్న ప్రజలు కేకలు వేస్తూ సాయం కోసం అర్థించారు. వెంటనే రంగంలోకి దిగిన సైన్యం.. స్పీడు బోట్ల సాయంతో ముప్పు బారిన పడ్డ ప్రజలను రక్షించింది. హెలికాప్టర్ల నుంచి తాడు సాయంతో సాగర్‌లోకి దిగిన సైనికులు.. అక్కడి నుంచి పడవల ద్వారా నీట మునిగిన భవనాల వద్దకు చేరుకుని బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విపత్తు నుంచి బయటపడ్డ ప్రజలు మీడియాతో తమ అనుభవాలను పంచుకున్నారు.
Samayam Telugu ndrf and airforce mock drill pralay sahay in hussain sagar
హుస్సేన్ సాగ‌ర్‌లో ‘ప్ర‌ళ‌యం’.. సైన్యం ‘సహాయం’


హుస్సేన్ సాగర్‌లో భవనాలెక్కడివి? ఒకవేళ ఉన్నా.. అవి మునిగేలా వానలెప్పుడు కురిశాయి.. అనుకోకండి. భాగ్యనగరంలో భారీ వరద సంభవిస్తే.. మునిగిన ఇళ్లు, భవనాల నుంచి ప్రజలను ఏవిధంగా రక్షించాలనే అంశంపై సైనికులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శనివారం (సెప్టెంబర్ 23) మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఆర్మీ అద్భుత విన్యాసాల‌కు హుస్సేన్ సాగ‌ర్ వేదికైంది.

'ప్రళయ్ స‌హాయ్' పేరుతో నిర్వహించిన మాక్ డ్రిల్ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. అనుకోని విపత్తు సంభవిస్తే.. ప్రజలను సైన్యం ఏవిధంగా రక్షిస్తుందో.. కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ విన్యాసాల‌ను లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ పీఎం హ‌రీద్‌, తెలంగాణ ఉప‌ ముఖ్య‌మంత్రి మ‌హ‌మూద్ అలీ వీక్షించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.