యాప్నగరం

​పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియాలో సెటైర్లు!

రాజకీయ నేతలు ఈ తరహాలో దొరికితే నెటిజన్లు ఊరికే ఉండరు కదా!

TNN 17 May 2017, 9:11 am
‘తనపై పుస్తకాల ప్రభావం చాలా ఉంది.. అని పవన్ కల్యాణ్ చెప్పుకొంటూ ఉంటారు, మరి ఇంతకీ ఆ పుస్తకాలేవో చెబితే వాటికి దూరంగా ఉంటాం..’ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు కొంతమంది నెటిజన్లు. ఈ తరహా వ్యంగ్యం వ్యక్తం అవుతోంది జనసేన అధినేత విషయంలో. మరి ఇంతకీ విషయం ఏమిటంటే.. ఇటీవల జరిగిన తన పార్టీ మీటింగ్ లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. బల్బును కనుగొన్నది ఐన్ స్టీన్ అన్నట్టుగా చేసిన వ్యాఖ్యలపై వ్యక్తం అవుతున్న స్పందన ఇది.
Samayam Telugu netizens satires on pk
​పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియాలో సెటైర్లు!


బల్బును కనుగొన్నది థామస్ అల్వా ఎడిసన్ అనేది ప్రాథమికమైన విషయం. అయితే పవన్ మాత్రం.. పొరపాటునో, గ్రహపాటునో.. బల్బును ఐన్ స్టీన్ కనుగొన్నాడు.. అనే వ్యాఖ్యానాలు చేశారు. మరి రాజకీయ నేతలు ఈ తరహాలో దొరికితే నెటిజన్లు ఊరికే ఉండరు కదా!

బీ కామ్ లో ఫిజిక్స్ చదివాను అని చెప్పుకొచ్చిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పై, తరచూ పొరపాటుగా మాట్లాడుతూ దొరుకుతున్న ఏపీ మంత్రి లోకేష్ బాబుపై నెటిజన్లు బోలెడన్ని సెటైర్లు వేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బల్బు ను ఐన్ స్టీన్ కనుగొన్నాడని చెప్పిన పవన్ కల్యాణ్ కూడా వారికి దొరికారు. ప్రత్యేకించి ఇప్పుడు పవన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో భారతీయ జనతా పార్టీ అనుకూల నెటిజన్లు ముందుండటం విశేషం. ఈ మధ్య అనేక విషయాల్లో పవన్ బీజేపీ తీరుపై విమర్శనాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. దీంతో వారు ఇప్పుడు పవన్ ను టార్గెట్ గా చేసుకొంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.